BREAKING
అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట! 12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్

నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ

Select Suryaa Now
నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ
సూర్య,కాగజ్‌నగర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కాగజ్‌నగర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె వివిధ రికార్డులు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మట్కా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు.పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, నేరస్తులకు చట్టప్రకారం శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి సత్వర న్యాయం అందించాలని సూచించారు. సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు.నేరస్తుల పట్ల కఠినంగా, బాధితుల పట్ల సౌమ్యంగా వ్యవహరిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ప్రేమ్ కుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.