BREAKING
అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట! 12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్

పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

Select Suryaa Now
  పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

 పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. పొగాకు, మత్తు పదార్థాల నియంత్రణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టర్ లో జరిగింది.
     
      పొగాకు, మత్తు పదార్థాలు, పానీయాల ద్వారా కలిగే నష్టంపై యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినీ, విద్యార్థుల కొరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠాలు బోధిస్తే చాలు ఉద్యోగం ముగిసింది అనే భావన ఉపాధ్యాయులు, అధ్యాపకులు వీడాలన్నారు. నవతరాన్ని సమాజానికి అందిస్తున్నామనే సామాజిక బాధ్యతతో పనిచేయాలని మార్గ నిర్దేశం చేశారు. కళాశాలలో స్టూడెంట్స్ క్లబ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పొగాకు వలన జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కళాశాలలకు 100 అడుగుల దూరంలో పొగాకు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాల విక్రయాల నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణాను పోలీస్ అధికారులు పూర్తిగా అరికట్టాలన్నారు. పబ్లిక్ ప్రదేశాలలో ధూమపానం, మద్యపానం చేస్తున్న వారిపై నమోదు చేశామన్నారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 661 మందికి రూ.91,600లు జరిమానాలు విధించామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలన్నారు.
       
       పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించాలని కలెక్టర్ చెప్పారు. వాణిజ్య పంటల జాబితాలో ఉన్న పొగాకును సాగు చేయకుండా చూడాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పొగాకు, గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలతో కలిగే తీవ్ర నష్టాన్ని విద్యార్థులకు వివరించాలన్నారు. తరగతి గదులలో వారికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు విస్తృతంగా పర్యటించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. 
      
       కోట్పా కింద ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని రాష్ట్రస్థాయి కమిటీ లీగల్ కన్సల్టెంట్, న్యాయవాది శివశంకర్ తెలిపారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసినప్పుడే గంజాయి వంటి మాదకద్రవ్యాలు నియంత్రించగలమన్నారు. కేసులు నమోదు చేయాలని సూచించారు. 
          
         ఈ సమావేశంలో ఏ ఎస్పి సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్.విజయమ్మ, డి సి హెచ్ ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసి డాక్టర్ శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి కోదండరాం, మెప్మా పీడీ ఆనందసత్యపాల్, కమిటీ సభ్యులు ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.