BREAKING
ఇళ్ల స్థలాల సాధనకు జర్నలిస్టుల మహాధర్నా జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి* కేంద్ర బడ్జెట్ 2027 కోసం ఫిక్కీ విష్‌లిస్ట్ ఏపీ తీరానికి అక్వాన్ తుఫాన్ ముప్పు నాకంటే నా కూతురికే యాక్టింగ్ పై ఎక్కువ అవగాహన ఉంది, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆసక్తికర వ్యాఖ్యలు డీఏ ఎరియర్స్ పెండింగ్ బిల్లులను తక్షణమే జమ చేయాలి: ఏపీటీఎఫ్ డిమాండ్ శ్రీ కుసుమ హరనాథ క్షేత్ర కార్తీక మాస లీలా కల్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఆహ్వానం! బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు శ్రద్ధా కపూర్ ఈత సినిమా నుంచి జి జి రే జి పాట విడుదల, ప్రసిద్ధ జానపద కళాకారిణి వితాబాయి జీవిత చరిత్ర ఆధారంగా ఘనమైన ఆవిష్కరణ ఆక్వాన్ తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట!

ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు

Select Suryaa Now
 ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు హెచ్చరించారు. ఈ రెండు శాఖల పనితీరుపై ఐవిఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో వస్తున్న ఫలితాలు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపుపై మంగళవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనం, ఆసుపత్రులలో పారిశుద్ధ్యం, డాక్టర్ల అందుబాటు, ఉచితంగా మందుల పంపిణీ, తదితర అంశాలలో జిల్లాకు దక్కిన స్థానాలపై కలెక్టర్ ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఆసుపత్రులలో ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పీ.హెచ్.సీ / సీ. హెచ్. సీ / ఏరియా ఆసుపత్రులలో పారిశుధ్య నిర్వహణ తీరును వైద్యులు నిరంతరం గమనిస్తూ ఉండాలని కలెక్టర్ చెప్పారు. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై మండల స్థాయి విద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, చిక్కీలు, కోడిగుడ్లు కూడా నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాలన్నారు. పరిస్థితిని మెరుగుపరిచిన చోట ఆయా విషయాలను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించాలని చెప్పారు. కాంట్రాక్టరైనా, అధికారులైనా విధులలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ స్పష్టం చేశారు. 
           ఈ సమావేశంలో డి.ఈ.ఓ. రంగయ్య, ఆర్.ఐ.ఓ. రాజేంద్ర, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డి.సి.హెచ్.ఎస్. విజయలక్ష్మి, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.