చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి*
చేర్యాల ...…చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ చైర్మన్ వకలాభరణం నర్సయ్య పంతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చేర్యాలలో నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 ఎన్నికల సందర్భంగా జనగామలో నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీని అమలు చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో, గతంలో ఇచ్చిన హామీ మేరకు చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని జేఏసీ తరఫున విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం గతంలో జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి, రాజీవ్ రహదారి దిగ్బంధం, అసెంబ్లీ ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.సిద్దిపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి చేర్యాల రెవెన్యూ డివిజన్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులను ప్రజలు తిరగనీయరని హెచ్చరించారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్ సాధన కోసం జేఏసీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్యాల బాల్ నరసయ్య, సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బూరుగు సురేష్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి నారాయణరెడ్డి, ముత్యాల నాగేశ్వరరావు, మంచాల కొండయ్య, పోతుగంటి రాందాసు, సర్పంచ్ పాండు పటేల్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ రవీందర్, గర్నెపల్లి రాము, బంగారు గళ్ల కిరణ్, సిద్ధి లింగం, ఇన్నారెడ్డి, సుదర్శన్ గౌడ్, తేలు ఇస్తారి, శ్రీహరి, రాజు, మైసయ్య, మాజీ సర్పంచ్ అంజయ్య, ఆవుచెర్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.