BREAKING
శ్రద్ధా కపూర్ ఈత సినిమా నుంచి జి జి రే జి పాట విడుదల, ప్రసిద్ధ జానపద కళాకారిణి వితాబాయి జీవిత చరిత్ర ఆధారంగా ఘనమైన ఆవిష్కరణ ఆక్వాన్ తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట! 12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ

12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు

Select Suryaa Now
12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు

సదాశివపేట ; సదాశివపేట పట్టణంలోని స్థానిక బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నూతన చేయూత ఆసరా పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన 12వ వార్డుకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను స్వయంగా అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా పులిమామిడి మమత సదాశివపేటపట్టణ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి ఎనుముల రేవంతరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం పులిమామిడి మమత రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. నూతనంగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.అనంతరం పులిమామిడి మమత రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. నూతనంగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.అలాగే 12వ వార్డులో పింఛన్ పొందేందుకు అర్హత ఉండి, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన దృష్టికి తీసుకువస్తే వారికి కూడా పింఛన్ అందేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక వసతులు అందించడంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ టి శివాజి, ఛైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక మరియు పింఛన్ లబ్ధిదారులు నాయికోటి కావేరి, సంగీత, రుమాండ్ల జయశ్రీ, పండాల సుకన్య, సులోచన, ముంతాజ్, రహీమున్నిసా, హలీం సుల్తానా, కళావతి, సాయి కుమార్, లత, కైసర్ బేగం, వర్కల లక్ష్మి, మారేపల్లి లక్ష్మి, సంగమని, ఫహేదా బేగం, ఫౌజియా బేగం తదితరులు పాల్గొన్నారు.