BREAKING
అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట! 12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర ఉదయగిరి మేజర్ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా షేక్ పెద్ద మస్తాన్ బీ ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన లక్ష్యం జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్

ఇందిరమ్మ టవర్స్ కు విశేష స్పందన - అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి

Select Suryaa Now
ఇందిరమ్మ టవర్స్ కు విశేష స్పందన - అర్హత కలిగిన వారు డిసెంబర్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతం ఆర్‌జీకే కాలనీలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ లో ఫ్లాట్ల కేటాయింపు కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.    నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో నివసిస్తున్న అర్హులైన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో సొంత ఇంటిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని గుర్తు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఆర్‌జీకే కాలనీలో 480 ఫ్లాట్ల కేటాయింపునకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.    ప్రతి ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్ విస్తీర్ణం 512 చదరపు అడుగులు కాగా, ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి లబ్ధిదారుడి వాటాగా తాత్కాలికంగా రూ.3.50 లక్షలు నిర్ణయించబడిందని, ఫ్లాట్ల నిర్మాణానికి అవసరమైన స్థలం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు.   అర్హత కలిగిన దరఖాస్తుదారులను ముందుగా ఐడీ వెరిఫికేషన్ ద్వారా గుర్తించి, అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్ల కేటాయింపు చేపడతామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత ఇల్లు లేదా ప్లాట్ లేని వారు, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించని వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తుకు అవకాశం ఉంటుందని తెలిపారు.