andhrapradesh
విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర
Andhrapradesh
17 Nov 2026
35 views
విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర
- డిఆర్ఓ మలోలా
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అన్ని వర్గాల పాఠకులకు విజ్ఞానాన్ని పంచడంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని డిఆర్ఓ మలోలా పేర్కొన్నారు. 59వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల్లో భాగంగా.. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నాలుగవ రోజు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శివప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డిఆర్ఓ ఏ మలోల హాజరయ్యారు. కవులు జెన్నే ఆనంద్ , కళాభూషణ్ అంకె రామలింగామయ్య , కళాపీఠం అధినేత ఉమాదేవి , కవయిత్రి నాగవేణి ,డాక్టర్ జి వెంకట సుబ్బయ్య , మధురశ్రీ, గంగిరెడ్డి అశ్వర్థరెడ్డి , నానీల నాగేంద్ర, లక్ష్మి శ్యాం , జూటూరు షరీఫ్ , రియాజుద్దీన్ , ఉస్మాన్ అలీఖాన్ గారు,గుడిపాటి సూర్యం , జోగి నాగరాజు, లీల మనోహర్, రఘు గాయత్రి, జెట్టి జయరాం తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథి డి ఆర్ ఓ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి కూడా గ్రంధాలయాలు సమాజానికి విజ్ఞానాన్ని పంచడం లో ప్రముఖ పాత్ర వయిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు కావలసిన అన్ని రకాల పుస్తకాలను సమకూర్చి వారి అభివృద్ధి కి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. నేను కూడా ఒక నిరుపేద సామాన్య కుటుంబంలో పుట్టి ఈ రోజు జిల్లా స్థాయి లో డిఆర్ఓగా ఉన్నానంటే కారణం గ్రంధాలయలే కారణమని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు గ్రంధాలయాలను చక్కగా ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కవులు ప్రసంగిస్తూ ప్రస్తుతం సమాజంలో ఉన్న అన్ని సమస్యలపై కవిత్వాన్ని వినిపించారు. ముఖ్యంగా స్త్రీ ల భద్రత విద్యార్థులకు భద్రత పై వారు తమదైనన శైలి లో కవితలు వినిపించారు. సంస్థ కార్యదర్శి జె శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో.. నిరుద్యోగులకు కావలసిన.. పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ గ్రంధాలయాధికారి పి కమ్మన్న, సహా గ్రంధాలయాధికారి డి గోవిందు కార్యాలయ సిబ్బంది రామాంజినమ్మ, కిరణ్, జీవన,ముత్యాలమ్మ, ఇందిరమ్మ,శిరీషా, సరస్వతమ్మ శ్రీవిజయ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Breaking News