దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టాండ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్ : జూబ్లీహిల్స్ శాసనసభ్యులు వి. నవీన్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు శ్రీనగర్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సేవా కార్యక్రమాలు: పుట్టినరోజు వేడుకలను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజానికి సేవా మార్గంలో నిలవాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ స్వయంగా దివ్యాంగులకు వీల్‌చైర్లు, వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి యంత్రాలు, అలాగే నడవడానికి ఇబ్బందులు పడుతున్న వారికి వాకింగ్ స్టాండ్స్‌ను పంపిణీ చేసి పెద్ద మనసు చాటుకున్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.