ఈ నెల 19న పారా క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు - పోస్టర్ లాంచ్
ఈ నెల 19న పారా క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు - పోస్టర్ లాంచ్అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం - 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి పారా క్రీడా ఎంపికలు ఈ నెల 19.11.2026 (గురువారం)న నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు నరసరావుపేటలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పోస్టర్ లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ పల్నాడు సెక్రెటరీ, పల్నాడు జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు వేముల బాలరాజు, నరసరావుపేట విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు యేనుగంటి వెంకటకృష్ణారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ జిల్లా స్థాయి ఎంపికలలో పాల్గొనే పారా క్రీడాకారులు మరిన్ని వివరాలకు 87126 22574, 91823 77787 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల