telangana
నేరేడ్‌మెట్, కాకతీయ నగర్ డివిజన్లలో రూ.2.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : నేరెడ్‌మెట్, కాకతీయనగర్ డివిజన్ల పరిధి లోని పలు కాలనీలలో రూ.2.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజ శేఖర్ రెడ్డి, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఇందులో జీకే కాలనీలో రిషబ్ ఐ హాస్పిటల్ సమీపంలో రూ.17 లక్షలతో సీసీ రోడ్డు, మాతృపురి కాలనీలో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు, వివేకా నందపురం ఆటో స్టాండ్ సమీపంలో రూ.95 లక్షలతో సీసీ రోడ్డు, కాకతీయనగర్‌లో జేబీఆర్ స్కూల్ నుంచి సాయి స్వప్న హాస్పిటల్ రోడ్డు వరకు రూ.68 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనుల ఉన్నాయి. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజిగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో, ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపా యాలను కల్పిస్తున్నానన్నారు. ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా అభివృద్ధి చేపడుతున్నానని, ఆయా కాలనీ వాసుల వినతి మేరకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పా రు. ఈ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే ఆయా కాల నీల్లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగు పడటంతో పాటు, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవడం, గుంతల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుతాయని, స్థాని క ప్రజలకు ఎంతో ప్రయో జనం చేకూరుతుందన్నారు. అలాగే, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఈ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువు లోగా పనులను పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఏఈ సత్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు బద్ధం పరశురాంరెడ్డి, జీకే హను మంతరావు, మేకల రాముయాదవ్, శ్రీనివాస్ రెడ్డి, శివగౌడ్, జెకే సాయి గౌడ్, సుమన్ గౌడ్, సంపత్ యాదవ్, జక్కుల కిరణ్, భాగ్యానందరావు, బాలకృష్ణ, సత్యనారాయణ, దినేష్, నవాబ్, రాజేష్ గౌడ్, సాయికుమార్, బొబ్బిలి విజయ్ రెడ్డి, శంకర్రావు, శ్రీనివాస్, నవీన్ రాజ్, సురేష్, రవీందర్ గంగాధర్, పేపర్ శీను, నవాబ్, సాయి సాగర్, మహేష్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.