BREAKING
పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గాజులరామారంలో ఘనంగా శ్రీశ్రీ కోటి దీపోత్సవం వెంకన్న ఆలయ పున నిర్మాణ పనులు పరిశీలన రుద్రంపేట పంచాయతీ వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బీ నామినేషన్ అఫ్గానిస్తాన్‌పై జింబాబ్వే సంచలన విజయం, ఉత్కంఠ పోరులో రెండో టెస్టుతో పాటు సిరీస్ కైవసం జనసేన బలపరిచిన పరింపూడి సర్పంచ్ అభ్యర్థి కోడూరి భారతి --అఖండ మెజారిటీతో గెలిపిద్దాం : ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాజీ సీఎం నల్లారిని కలిసిన జడ్పిటిసి జబ్బల మీనా : భాజపా నేత జబ్బల శ్రీనివాసులుకు అభినందనలు టెక్నాలజీతో పరీక్షల్లో కొత్త తరహా మోసాలు... నసనకోట టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్న ముత్యాలప్ప నామినేషన్ దాఖలు.. అర్హులైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు కృషి చేస్తా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం క్లస్టర్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ పంట కోత ప్రయోగాలు 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు జీవ వనరుల కేంద్రం సమగ్ర సస్య రక్షణ అవగాహన సమావేశం

24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు

Select Suryaa Now
24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు

24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు

-కార్తీక పౌర్ణమి సందర్భంగా తులసీ కల్యాణం,ప్రత్యేక పూజలు

సిద్దిపేట రూరల్,మేజర్ న్యూస్:కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పుల్లూరుబండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఈ నెల 24న సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు క్షేత్ర వంశపారంపర్య అర్చకులు తెలిపారు. ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో తులసీ కల్యాణంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా అర్చకులు కలకుంట్ల వెంకట నర్సింహాచార్యులు, కృష్ణమాచార్యులు, రంగాచారి, చిలకమర్రి వెంకట రమణాచార్యులు, శేషుకుమార్, హరినాథ్, గౌతమ్‌లతో పాటు గ్రామ సర్పంచ్ కుంచం లత వెంకట్, మాజీ సర్పంచులు తిరుపతిరెడ్డి, నరేష్ గౌడ్, దేశిట్టి తిరుపతి, యాదగిరి, కనక మల్లేశం తదితరులు వ్రతాల కరపత్రాన్ని మంగళవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో దైవారాధన, దీపారాధన, పూజలు నిర్వహించడం ఎంతో పుణ్యప్రదమని తెలిపారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా పుల్లూరుబండ క్షేత్రంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వ్రతంలో పాల్గొనే దంపతులు రూ.301 చెల్లించి రశీదు పొందాలని నిర్వాహకులు సూచించారు.

(సూర్యా రూరల్, రమేష్)