మృతుని కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం
కనగల్ మేజర్ న్యూస్: మండలంలోని శబ్దలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కారింగు రజినీకాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు సోమవారం కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.50,000 పంపించడం జరిగింది. ఆర్థిక సాయం ను సర్పంచ్ తంగిరాల అంతయ్య, హైకోర్టు న్యాయవాది, మాజీ సర్పంచ్ కేసాని వెంకటరెడ్డి, ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసింది నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజనీకాంత్ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కారింగు స్వామి, నాయకులు మాధవరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సురవరం లింగయ్య, కోయ శ్రీనివాస్ రెడ్డి, కారింగ్ పురుషోత్తం, యాదయ్య, శివాజీ, చెరుపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.