BREAKING
చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం

ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం

Select Suryaa Now
ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం

తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ప్రజల నుంచి వచ్చే ప్రతి ధరఖాస్తును రికార్డు చేయాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాలు జారీ చేశారు.  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజావాణికి హాజరైన ప్రజల నుంచి వస్తున్న వినతులు, ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా రికార్డు చేయాలని, ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. భీమదేవరపల్లి మండలంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఫామ్ పాండ్స్, ఆరుతడి పంటల సాగు, విద్యుత్ సమస్యలు, విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన అంశాలపై ఆయా శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు. గతంలో మండలంలో గుర్తించిన సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చిందని, పెండింగ్‌లో ఉన్న సమస్యలేమిటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులను ఆరా తీశారు. ఇప్పటివరకు ఎన్ని ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించారు, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణికి ప్రతి వారం వచ్చే దరఖాస్తుల సంఖ్య, పరిష్కారమైన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలతో వారంవారీ నివేదిక రూపొందించి అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి నిర్వహించే సమయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన సమాచారం, ఆధారాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.