BREAKING
ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు సకల దోషహరం.. కార్తీక సత్యనారాయణ వ్రతం! ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి బుగెన్‌విల్లే మైనింగ్ బాధ్యతలపై రియో టింటో చారిత్రాత్మక నిర్ణయం రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ కావలిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. వేడెక్కిన ఎన్నికల సమరం. తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

వేరే ఏ దర్శకుడు అడిగినా జుట్టు కత్తిరించుకునేదాన్ని కాదు.. 'ఓం' లుక్‌పై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!

Select Suryaa Now
వేరే ఏ దర్శకుడు అడిగినా జుట్టు కత్తిరించుకునేదాన్ని కాదు.. 'ఓం' లుక్‌పై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ నటి సాయి పల్లవి ఇటీవల ఓం చిత్రంలోని తన పాత్ర కోసం జుట్టు కత్తిరించుకున్న విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, వేరే ఏ దర్శకుడు అడిగినా ఇలా చేసేదాన్ని కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కొత్త హెయిర్ లుక్, ఆ సమయంలో తల్లిదండ్రుల స్పందన గురించి ఆమె పలు విషయాలను పంచుకున్నారు. ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జుట్టు కత్తిరించుకున్న తర్వాత తొలుత తన తల్లికి వీడియో కాల్ చేశానని సాయి పల్లవి తెలిపారు. తన కొత్త లుక్ చూడగానే అమ్మ ఒక్కసారిగా షాక్‌కు గురై ఫోన్ కట్ చేశారని సరదాగా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత నాన్న ఫోన్ చేసి ఇది విగ్గే కదా పల్లవి అని నమ్మలేక అడిగారని, పాత్ర కోసమే నిజంగా జుట్టు కత్తిరించుకున్నానని చెప్పిన తర్వాత నాన్న అమ్మకు నచ్చజెప్పి మాట్లాడించారని వివరించారు. ఈ కొత్త లుక్‌కు తల్లిదండ్రులు అలవాటు పడటానికి కొంత సమయం పట్టిందని చెప్పారు.

ఈ సినిమాలో నిత్యారెడ్డి అనే పోలీసు అధికారి పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. కథ చెప్పినప్పుడు ఈ పాత్రకు తాను ఎలా సరిపోతాననే సందేహం కలిగిందని, అయితే దర్శకుడు రాజ్‌కుమార్ ఐపీఎస్ అధికారి మెరిన్ జోసెఫ్ ఫొటోలను చూపిస్తూ అలాంటి లుక్ కావాలని చెప్పారని తెలిపారు. ఆమెకు జుట్టు తక్కువగా ఉంటుందని తాను అడిగితే, మీరు కూడా జుట్టు కత్తిరించుకుంటే సరిగ్గా సరిపోతుందని దర్శకుడు చెప్పారని, ఆయన విజన్‌పై విశ్వాసంతోనే అంగీకరించానని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ఈ లుక్ బయటకు పొక్కకుండా స్కార్ఫ్‌తో తలను కప్పి ఉంచేవారని తెలిపారు.

రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓం చిత్రంలో ధనుష్, మమ్ముట్టిలతో పాటు శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.