BREAKING
కార్పొరేట్ రంగంలో కొత్త నిబంధనల భారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ నామినేషన్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి యుద్ధ వాతావరణం నీడలో సౌదీ అరేబియా 'విజన్ 2030' భవిష్యత్ ఎల్ నినో ప్రభావం పై రైతులకు శిక్షణ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి దివ్యాంగ బాలల దినోత్సవ వేడుకలు మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు, హెచ్.ఐ.వి అవగాహన సదస్సు. వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్  డబుల్ ఈగిల్ ఆస్తుల కొనుగోలుకు రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందం

అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం

Select Suryaa Now
అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం
సూర్య వేల్పూరు : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వయం పరిపాలక దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల జీహెచ్ఎం కారు మల్లీశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టి పాఠాలు బోధించారు.ఈ సందర్భంగా మేఘన హెచ్ఎంగా, భానుశ్రీ పీడీగా వ్యవహరించగా, స్నేహిత, శృతి, రిషిత, రితిక, ఆనందిని, తరుణశ్రీ, రక్షిత్, ఈశ్వర్ తదితర మొత్తం 22 మంది విద్యార్థినీ విద్యార్థులువివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగావ్యవహరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఒక్కరోజు పాఠశాలను నిర్వహించడం అంత సులభమైన విషయం కాదని, విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వారిని క్రమశిక్షణలో ఉంచడం ఎంత కష్టమో ఈరోజు ప్రత్యక్షంగా తెలుసుకున్నామని అన్నారు. ఉపాధ్యాయుల వృత్తి ఎంతో ఆదర్శవంతమైనదని, వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలిపారు.అనంతరం జీహెచ్ఎం కారు మల్లీశ్వరి వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవిచందర్, రఘునాథ్, రాజేంద్ర, దేవరాజ్, సదాశివ్, వినోద్, శ్రీలక్ష్మి, శ్రీదేవి, యమునా దేవి, సుకన్య, జాన్సన్, వేణుగోపాల్, రాజు మూర్తి తదితరులు పాల్గొన్నారు.