ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఈ నెల 17వతేదీ మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులతో నెల్లూరులో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటు చేయబడినదని మంత్రి కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ఆయా మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు,ఏ ఎం సి / పీఏసీఎస్ అధ్యక్షులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఇతర ముఖ్యులు తప్పనిసరిగా హాజరై సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరారు.