BREAKING
నా ఓటు.. నోటుకు కాదు ! రూ.500 నోట్లను బ్యాలెట్ బాక్స్‌లో వేసిన ఓటరు ఒకేరోజు బాక్సాఫీస్ పోరు.. మమ్ముట్టి 'ఓం' వర్సెస్ దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'! పొదిలి నగర ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నాం - మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఇరాక్ కేంద్రంగా అక్రమ చమురు రవాణా మానం రాజేశ్వరి నామినేషన్‌కు భారీ ర్యాలీ అట్టహాసంగా ఆనంగి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సీఐ తిమ్మయ్య. ఆదిత్యలో ఏఐ ఫండమెంటల్స్,డిజైన్ థింకింగ్స్ అంశంపై వర్క్ షాప్ : పలు అంశాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన 'ఐ హేట్ మ్యారేజ్' ట్రైలర్ రిలీజ్.. నేటి తరం యువత ఆలోచనలతో ఆకట్టుకుంటోంది! రైతులకు శిక్షణ. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న బాంకో బీపీఎం సీఈఓ మానం రాజేశ్వరికి నామినేషన్ పత్రాలు అందజేసిన దారపనేని ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో వరుణ హోమం – రైతులను ఆదుకోవాలని వరుణ దేవునికి ప్రత్యేక పూజలు పెద్ద కలలు, ప్రేమ, ఊహించని మలుపులు.. 'టీన్ తిగడా' ట్రైలర్ రిలీజ్! గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో 'లఖ్‌పతి దీదీ' పథకం కీలక పాత్ర

రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

Select Suryaa Now
రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

రొంపిచెర్ల, మేజర్ న్యూస్: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు రొంపిచెర్ల మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో ఎస్. మధుసూదన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు మండలంలోని మూడు నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సోమవారం వెల్లడించారు. ప్రతి నామినేషన్ కేంద్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, ఎనిమిది మంది సహాయక సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రతి నామినేషన్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మండలంలోని మూడు నామినేషన్ కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. అలాగే మూడు నామినేషన్ కేంద్రాల్లో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారన్నారు. బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ భవనంలో బండకిందపల్లె, పెద్దగొట్టిగల్లు, బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీలకు, రొంపిచెర్ల గ్రామ పంచాయతీ భవనంలో రొంపిచెర్ల, బోడిపాటివారిపల్లె, మోటుమల్లెల, గానుగచింత గ్రామ పంచాయతీలకు, పెద్దమల్లెల స్వర్ణ గ్రామ భవనంలో పెద్దమల్లెల, చిచ్చిలివారిపల్లె, చెంచమరెడ్డిగారిపల్లె, జాండ్లవారిపల్లె గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో ఎస్. మధుసూదన రెడ్డి తెలిపారు.