మానం రాజేశ్వరి నామినేషన్‌కు భారీ ర్యాలీ
పామూరు, మేజర్ న్యూస్ : తూర్పుకోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మానం రాజేశ్వరి నామినేషన్ దాఖలు చేసేందుకు కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ మద్దతుదారులు, అభిమానులు, కార్యకర్తలు సోమవారం భారీ ర్యాలీగా తరలివెళ్లారు. పామూరు పట్టణంలోని శేషమహల్ థియేటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ స్వర్ణ గ్రామం వరకు ఉత్సాహంగా కొనసాగింది. దారపనేని చంద్రశేఖర్‌కు మద్దతుగా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మానం రాజేశ్వరికి సంఘీభావం ప్రకటించారు.