ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకు తన సంపూర్ణ సహకారం : మునిసిపల్ ఛైర్మన్ శ్రీరామ్ చినబాబు భరోసా : ఘనంగా సన్మానించిన ఏపీపీటీడీ ఈయు నాయకులు
మదనపల్లి,మేజర్ న్యూస్ : ఇటీవల జరిగిన మునిసిపాలిటీ ఎన్నికలలో మదనపల్లి మునిసిపల్ చైర్మనుగా చారిత్రాత్మక విజయం సాధించిన శ్రీరామ్ కుమార్ (చినబాబు)ని సోమవారం అన్నమయ్య జిల్లా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతోపాటు 1,2 డిపోల గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) మర్యాదపూర్వకంగా
కలిశారు.ఇందులో భాగంగా శ్రీరామ్ చినబాబుకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.ఆర్టీసీ ఉద్యోగం ఎంతో కష్టతరమైనదని,ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో వారి పాత్ర అద్వితీయమన్నారు.ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం ఎంప్లాయిస్ యూనియన్ ముందువరుసలో నిలవడం శుభసూచకమన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యలు నాగూర్ వలి మాట్లాడుతూ సాధారణ చేనేత కుటుంబం నుండి వచ్చిన శ్రీరామ్ చినబాబు రాజకీయాలలో అంచలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ నుండి మదనపల్లి మునిసిపల్ ఛైర్మనుగా విజయం సాధించడం గర్వకారణమన్నారు.కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడని,ఆయన సహకారంతో ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఈయు గౌరవ అధ్యక్షులు సి.ఎ.బాబు,జిల్లా చైర్మన్ పి.వి.బయ్యారెడ్డి,జిల్లా కార్యదర్శి బి.ఎస్.ఎస్.రెడ్డి,జిల్లా సంయుక్త కార్యదర్శి ఎస్.కె.రెడ్డి,ఎం.ఎస్.రామయ్య,కె.సుధాకర్,సునీల్,కె.బి.రావు,వన్ డిపో అధ్యక్షుడు కె.శివయ్య,సి.టి.కుమార్,కె.మోహన్,ఎం.ఎస్.నాయుడు,బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి