BREAKING
బలిజేపల్లిలో కన్నుల పండువగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం --శివనామస్మరణతో మార్మోగిన మల్లేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ భారత జోన్ మహిళల చెస్ టోర్నమెంట్‌లో జీజీహెచ్‌ఎంసీ ఒంగోలు విద్యార్థిని ప్రతిభ పకడ్బందీగా సమ్మేటివ్ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు పుల్లగుమ్మి సర్పంచ్ అభ్యర్థిగా మురసాని నాగలక్ష్మమ్మ ఏకగ్రీవానికి సహకరించాలని మురసాని అజయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి పిల్లల మాటకు విలువ ఇద్దాం.. వారి అభిప్రాయాలను గౌరవిద్దాం నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్ నాగాయగుంట సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి వడ్డీ నిర్మలమ్మ ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూసి ఉంచాలి : సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య పంచాయితీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి -ఆర్ఓ అనంతరాజు కృష్ణంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోతిరెడ్డి తిరుపతిరెడ్డి నామినేషన్ గ్రంధాలయ పితామహునికి నివాళులు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఉత్తమ అవార్డు ఈ నెల 19న నెల్లూరులో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు - డి ఈ వో బాలాజీరావు 'మైసా' నుంచి 'ఏనాటి వరమో నువ్వు' సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రష్మిక లుక్! గ్రంథాలయోద్యమ ప్రముఖులకు నివాళి కారు బోల్తా,నలుగురికి గాయాలు

APUWJ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
APUWJ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు

 

కర్నూలు, నవంబర్ 16: 
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తనకు పార్లమెంటు చట్టం ద్వారా కల్పించిన చట్టబద్ధమైన బాధ్యతలను విస్మరించకుండా సక్రమంగా నిర్వర్తించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ.ఎన్. రాజు, జాతీయ సమితి సభ్యులు కే. నాగరాజు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర ఉపాధ్యక్షులు గోరంట్ల కొండప్ప తదితరులు డిమాండ్ చేశారు. నవంబర్ 16 న జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని APUWJ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఆవరణలోని పౌర సమాచార సంబంధాల శాఖ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐ అండ్ పీఆర్ డీడీ జయమ్మ కేక్ కట్ చేసి జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ, జర్నలిజంలో నైతిక విలువలు, వృత్తి ప్రమాణాలు, జర్నలిస్టుల వృత్తిగౌరవాన్ని పెంపొందించేందుకు భారత పార్లమెంటు చట్టం ద్వారా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైందన్నారు. 1966 నవంబర్ 16న అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించిందని, ఆ చారిత్రాత్మక రోజును ఏటా జాతీయ పత్రికా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం కేవలం వార్షిక వేడుకగా మాత్రమే మిగిలిపోకూడదని, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ, వర్కింగ్ జర్నలిస్టుల వేతన సవరణ, మెరుగైన పని పరిస్థితులు, మీడియా సిబ్బంది రక్షణ, మహిళా జర్నలిస్టులకు పని ప్రదేశాల్లో భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. తాజాగా నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయని విమర్శించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించాల్సిన పీసీఐ, అందుకు భిన్నంగా జర్నలిస్టులు నిరసన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగాల సమయంలో తప్పించుకునే మార్గాలను చూసుకోవాలని సూచించడం బాధాకరమన్నారు. ఇలాంటి సూచనలు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను, సంఘటనలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల ప్రాథమిక విధులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను సంబంధిత వ్యవస్థలు విస్మరించకూడదని, పీసీఐ తన చట్టబద్ధమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి, మాజీ కోశాధికారి హుస్సేన్, నగర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, APUWJ నాయకులు అశోక్ గౌడ్, కుమార్, భాస్కర్, రమేష్, రమేష్ రెడ్డి, దిశ బ్యూరో మనోహర్, నాయకులు ఫయాజ్, అసిఫ్, ఏపీ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్. సుధాకర్, వీడియో జర్నలిస్ట్ సంఘం నాయకులు చంద్రశేఖర్, మద్దిలేటి, శేఖర్, రాజు, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.