కృష్ణంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోతిరెడ్డి తిరుపతిరెడ్డి నామినేషన్
పామూరు, మేజర్ న్యూస్ : హనుమంతుని పాడు మండలంలోని కృష్ణంపల్లి గ్రామ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోతిరెడ్డి తిరుపతిరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన పోతిరెడ్డి తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఎంపీటీసీ మందా సునీల్ పాల్గొన్నారు.