పుల్లగుమ్మి సర్పంచ్ అభ్యర్థిగా మురసాని నాగలక్ష్మమ్మ ఏకగ్రీవానికి సహకరించాలని మురసాని అజయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి
వెల్దుర్తి, మేజర్ న్యూస్: పుల్లగుమ్మి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కీర్తిశేషులు మురసాని నాగేశ్వరరెడ్డి సతీమణి మురసాని నాగలక్ష్మమ్మను ప్రకటిస్తున్నట్లు తెదేపా యువ నాయకుడు మురసాని అజయ్ కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సహకారం, జిల్లా తెదేపా నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు చొరవతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. గతంలో గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి తాము సహకరించామని గుర్తుచేశారు. ప్రస్తుతం సర్పంచ్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ (యూఆర్) కావడంతో ఈసారి తమ కుటుంబానికి ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని గ్రామస్థులను కోరారు. సర్పంచ్‌గా గెలిచిన వెంటనే గ్రామంలో ఆసుపత్రి, రామాలయం నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు