BREAKING
చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం

బలిజేపల్లిలో కన్నుల పండువగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం --శివనామస్మరణతో మార్మోగిన మల్లేశ్వర స్వామి దేవస్థానం

Select Suryaa Now
బలిజేపల్లిలో కన్నుల పండువగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం --శివనామస్మరణతో మార్మోగిన మల్లేశ్వర స్వామి దేవస్థానం

వేమూరు(భట్టిప్రోలు) మేజర్ న్యూస్: వేమూరు మండలంలోని బలిజేపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ధ్వజారోహణ, ధ్వజస్తంభ పునర్నిర్మాణ, పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా, భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది.
సోమవారం ఉదయం గం 9-45 లకు అర్చకులు వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ నూతన ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణం మొత్తం "హర హర మహాదేవ, ఓం నమః శివాయ" నామస్మరణతో మార్మోగిపోయింది. భక్తులు భక్తితో ధ్వజస్తంభానికి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

*క్రేన్ సాయంతో ధ్వజస్తంభ ప్రతిష్ఠ*

భారీ ధ్వజస్తంభాన్ని క్రేన్ సాయంతో జాగ్రత్తగా నిలబెట్టిన దృశ్యం భక్తులను ఎంతో ఆకట్టుకుంది. ఆలయ గోపురం ముందు పూలతో అలంకరించిన బంగారు వర్ణ ధ్వజస్తంభం ఆకాశాన్ని తాకుతూ దర్శనమిచ్చింది. అరటి చెట్లు, మామిడి తోరణాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. గజ స్తంభ ప్రతిష్టా కార్యక్రమానికి మండల పరిధిలోనే కాక ఇతర గ్రామాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.