దక్షిణ భారత జోన్ మహిళల చెస్ టోర్నమెంట్‌లో జీజీహెచ్‌ఎంసీ ఒంగోలు విద్యార్థిని ప్రతిభ
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
హైదరాబాద్‌లోని వోక్సెన్ యూనివర్సిటీలో నవంబర్ 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మహిళల దక్షిణ భారత జోన్ చెస్ టోర్నమెంట్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల (జీజీహెచ్‌ఎంసీ), ఒంగోలు విద్యార్థిని నివేదిత బాయి బానావత్ విశేష ప్రతిభ కనబరిచారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలులో 2022 బ్యాచ్‌కు చెందిన విద్యార్థిని నివేదిత బాయి బానావత్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మహిళల చెస్ జట్టుకు ఎంపికై దక్షిణ భారత జోన్ స్థాయి పోటీల్లో విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించారు. దేశంలోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారిణులు పాల్గొన్న ఈ పోటీల్లో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం జట్టు ఆరో స్థానాన్ని సాధించడం విశేషం.
ఈ సందర్భంగా విద్యార్థిని సాధించిన విజయంపై ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందిస్తూ, చదువుతో పాటు క్రీడా రంగంలోనూ ప్రతిభ కనబరచడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థినిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఫిజికల్ డైరెక్టర్ రాధాకృష్ణను కూడా ఆమె అభినందించారు.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి పేర్కొన్నారు.
నివేదిత సాధించిన ఈ గుర్తింపు పట్ల ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఫొటో క్యాప్షన్: దక్షిణ భారత జోన్ మహిళల చెస్ టోర్నమెంట్‌లో ఆరో స్థానం సాధించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జీజీహెచ్‌ఎంసీ ఒంగోలు విద్యార్థిని నివేదిత బాయి బానావత్‌ను అభినందిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి, ఫిజికల్ డైరెక్టర్ రాధాకృష్ణ.