BREAKING
బలిజేపల్లిలో కన్నుల పండువగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం --శివనామస్మరణతో మార్మోగిన మల్లేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ భారత జోన్ మహిళల చెస్ టోర్నమెంట్‌లో జీజీహెచ్‌ఎంసీ ఒంగోలు విద్యార్థిని ప్రతిభ పకడ్బందీగా సమ్మేటివ్ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు పుల్లగుమ్మి సర్పంచ్ అభ్యర్థిగా మురసాని నాగలక్ష్మమ్మ ఏకగ్రీవానికి సహకరించాలని మురసాని అజయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి పిల్లల మాటకు విలువ ఇద్దాం.. వారి అభిప్రాయాలను గౌరవిద్దాం నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్ నాగాయగుంట సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి వడ్డీ నిర్మలమ్మ ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూసి ఉంచాలి : సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య పంచాయితీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి -ఆర్ఓ అనంతరాజు కృష్ణంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోతిరెడ్డి తిరుపతిరెడ్డి నామినేషన్ గ్రంధాలయ పితామహునికి నివాళులు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఉత్తమ అవార్డు ఈ నెల 19న నెల్లూరులో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు - డి ఈ వో బాలాజీరావు 'మైసా' నుంచి 'ఏనాటి వరమో నువ్వు' సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రష్మిక లుక్! గ్రంథాలయోద్యమ ప్రముఖులకు నివాళి కారు బోల్తా,నలుగురికి గాయాలు

బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్ సంగీత. బాలల ప్రత్యేక ప్రజావాణికి 50 అర్జీలు .

Select Suryaa Now
బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్ సంగీత.  బాలల ప్రత్యేక ప్రజావాణికి 50 అర్జీలు .

సంగారెడ్డి, ప్రతినిధి : బాలల హక్కుల పరిరక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంగీత ఆదేశించారు. బాలల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాధారణ ప్రజావాణితో పాటు బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. మై డే మై రైట్ మై ఫ్యూచర్ (నా రోజు, నా హక్కులు, నా భవిష్యత్తు)అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని  నిర్వహించారు .అదనపు కలెక్టర్ సంగీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారితో కలిసి బాలల నుంచి 50 అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని పలు పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన బాలలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.  దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని, అదనపు తరగతి గదులు నిర్మించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రహరీ గోడలు నిర్మించాలని, మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలని, ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని, గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించాలని కోరుతూ అర్జీలు సమర్పించారు.  ఈ అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. బాలలకు మెరుగైన భవిష్యత్తును అందించడం, వారి హక్కులను పరిరక్షించడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం చూపడమే బాలల ప్రత్యేక ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బాలలకు విద్య, వైద్యం, రక్షణతో పాటు సమాన అవకాశాలు కల్పించేలా సంబంధిత శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.   బాలల అభిప్రాయాలకు, సమస్యలకు తగిన ప్రాధాన్యతనిస్తూ వారి అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ శాఖలతో పాటు సంబంధిత వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలని, వారికి సురక్షితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. బాలలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి లలితాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ యాదగిరి, లింగం, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.