BREAKING
చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం

ఫిర్యాదుల పరిష్కారంలో జవాబుదారీతనం పాటించాలి : అదనపు కలెక్టర్ సంగీత. ప్రజావాణికి 75 వినతులు.

Select Suryaa Now
ఫిర్యాదుల పరిష్కారంలో జవాబుదారీతనం పాటించాలి : అదనపు కలెక్టర్ సంగీత.  ప్రజావాణికి 75 వినతులు.

సంగారెడ్డి, ప్రతినిధి :- ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, ప్రతి ఫిర్యాదుపై అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అదనపు కలెక్టర్ సంగీత సూచించారు. ఏ ఒక్క వినతినీ నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.  సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్  సంగీత  ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు చేశారు.కార్యక్రమంలో మొత్తం 75 వినతులు అందాయి. వీటిలో సంగారెడ్డి డివిజన్ నుంచి 16, నారాయణఖేడ్ డివిజన్ నుంచి 3, కలెక్టరేట్ పరిధిలో 56 వినతులు నమోదయ్యాయి. జహీరాబాద్, అందోల్ డివిజన్ల నుంచి ఎలాంటి వినతులు అందలేదని అధికారులు తెలిపారు.వివిధ శాఖల్లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ముఖ్యమంత్రి ప్రజావాణికి సంబంధించిన అర్జీలను సైతం ప్రాధాన్యతతో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో అవసరమైన విచారణ చేపట్టి, బాధితులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.