BREAKING
నా ఓటు.. నోటుకు కాదు ! రూ.500 నోట్లను బ్యాలెట్ బాక్స్‌లో వేసిన ఓటరు ఒకేరోజు బాక్సాఫీస్ పోరు.. మమ్ముట్టి 'ఓం' వర్సెస్ దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'! పొదిలి నగర ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నాం - మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఇరాక్ కేంద్రంగా అక్రమ చమురు రవాణా మానం రాజేశ్వరి నామినేషన్‌కు భారీ ర్యాలీ అట్టహాసంగా ఆనంగి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సీఐ తిమ్మయ్య. ఆదిత్యలో ఏఐ ఫండమెంటల్స్,డిజైన్ థింకింగ్స్ అంశంపై వర్క్ షాప్ : పలు అంశాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన 'ఐ హేట్ మ్యారేజ్' ట్రైలర్ రిలీజ్.. నేటి తరం యువత ఆలోచనలతో ఆకట్టుకుంటోంది! రైతులకు శిక్షణ. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న బాంకో బీపీఎం సీఈఓ మానం రాజేశ్వరికి నామినేషన్ పత్రాలు అందజేసిన దారపనేని ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో వరుణ హోమం – రైతులను ఆదుకోవాలని వరుణ దేవునికి ప్రత్యేక పూజలు పెద్ద కలలు, ప్రేమ, ఊహించని మలుపులు.. 'టీన్ తిగడా' ట్రైలర్ రిలీజ్! గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో 'లఖ్‌పతి దీదీ' పథకం కీలక పాత్ర

ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి

Select Suryaa Now
ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి
సూర్య, పెంచికల్‌పేట్: మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన సమాచారంతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి లింగయ్య కోరారు. ఈ మేరకు సోమవారం పెంచికల్‌పేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓ గాజుల శ్రీనివాస్ కు  వినతిపత్రం అందజేశారు.ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల పేర్లు, హోదాలు, సంప్రదింపు నంబర్లు, పని వేళలు, అందించే సేవలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, ఫిర్యాదుల స్వీకరణ అధికారి వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలిసేలా తెలుగు భాషలో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. సరైన సమాచారం అందుబాటులో లేక సామాన్యులు, నిరుపేదలు, వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు.అదేవిధంగా గ్రామపంచాయతీల్లో సమాచార హక్కు చట్టం బోర్డులతో పాటు గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు, చేసిన ఖర్చులు, మిగులు నిధుల వివరాలను కూడా బోర్డులపై ప్రదర్శించాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనీ తెలిపారు.