రైతులకు శిక్షణ.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : మల్లూరు గ్రామ రైతు సేవా కేంద్రం నందు ఆత్మ సౌజన్యంతో రైతులకు పూర్వ అభ్యాస శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తసురేఖ దేవి పాల్గొనడం జరిగినది.వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించవలసి ఉంటుందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వరి పంటలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి వివరించడం జరిగినది. వ్యవసాయాధికారిని మాట్లాడుతూ కొత్తగా అమల్లోకి వచ్చిన ఎఫ్. ఎఫ్.ఎస్ ఎరువుల పంపిణీ యాప్ ద్వారా ఎరువులను నమోదు చేసుకునే విధానాన్ని రైతులకు వివరించి రైతులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమానికి గ్రామ వి ఏ ఏ జగదీష్ మరియు రైతు సోదరులు పాల్గొనడం జరిగినది.