కార్తీక సోమవారం పర్వదినం సందర్భంగా పాతాళ నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి
గిద్దలూరు, మేజర్‌న్యూస్ :
గిద్దలూరు పట్టణంలోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాసం మొదటి సోమవారం, కోటి సోమవారాల విశిష్ట పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రథమ పూజ నిర్వహించి, శివపార్వతులకు ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, గిద్దలూరు నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి చిక్కుడు శ్రీనివాసులు గారు, బీజేపీ నాయకులు పిడతల రమేష్ రెడ్డి గారు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు.