రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక*
*కర్నూలు:* లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు ఎన్.ఎస్.ఎం. జ్ఞానదత్త, పి. చేతన్ రెడ్డి అండర్-17 స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు.
ఈ నెల 19 నుంచి 21 వరకు కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నారు.
విద్యార్థులను పాఠశాల సీఈఓ జి. గోపీనాథ్, కో-సీఈఓ జి. సౌమ్య గోపీనాథ్ అభినందించి, జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.