BREAKING
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఉత్తమ అవార్డు ఈ నెల 19న నెల్లూరులో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు - డి ఈ వో బాలాజీరావు 'మైసా' నుంచి 'ఏనాటి వరమో నువ్వు' సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రష్మిక లుక్! గ్రంథాలయోద్యమ ప్రముఖులకు నివాళి కారు బోల్తా,నలుగురికి గాయాలు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి పొన్నం నామినేషన్ల కేంద్రాల పరిశీలన జిల్లా కలెక్టర్ , చేతుల మీదుగా దత్తత ఫిర్యాదుల పరిష్కారంలో జవాబుదారీతనం పాటించాలి : అదనపు కలెక్టర్ సంగీత. ప్రజావాణికి 75 వినతులు. మృతుని కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీలకు తలనొప్పి! గ్రామాల్లో ఒకే సామాజిక వర్గం నుంచి పలువురి పోటీ.. ఎటూ తేల్చుకోలేక రాజకీయ పార్టీలు గ్రామాభివృద్ధి పేరుతో ముందస్తు హామీలు.. నగదు, పొలాలు రాసిస్తామంటూ ప్రచారం ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్* విజయ్ బయోపిక్‌లో హీరోగా జేసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే? కంది,వరి పంటలపై శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పరిశీలన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక*

పాత్రికేయుల సేవలు అభినందనీయం జాతీయ పత్రికా దినోత్సవ వేడుకల్లో తిరువీధి రమేష్ శెట్టి

Select Suryaa Now
పాత్రికేయుల సేవలు అభినందనీయం జాతీయ పత్రికా దినోత్సవ వేడుకల్లో తిరువీధి రమేష్ శెట్టి

వెల్దుర్తి, మేజర్ న్యూస్: సమాజంలోని లోటుపాట్లను నిర్భయంగా వెలికితీస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయులు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త, గ్రామ పెద్ద తిరువీధి రమేష్ శెట్టి పేర్కొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వెల్దుర్తి పట్టణంలోని టీవీఎస్ కార్యాలయంలో తిరువీధి రమేష్ శెట్టి, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ రాంప్రసాద్ ఆధ్వర్యంలో మండల విలేకరులకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కోసి పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాలతో సత్కరించి, కలాలను బహూకరించారు.

కార్యక్రమంలో రమేష్ శెట్టి మాట్లాడుతూ.. కత్తికన్నా పదునైన కలం పాత్రికేయుల చేతిలో ఉందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని లోటుపాట్లను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారని కొనియాడారు. వరదలు, తుపానులు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు అధికార యంత్రాంగం కంటే ముందే ఘటనా స్థలానికి చేరుకుని అప్రమత్తం చేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో తాను సర్పంచ్‌గా ఎన్నికైతే పాత్రికేయులకు ఇంటి స్థలాలు అందించి, ప్రభుత్వ సహకారంతో ఇళ్ల నిర్మాణానికి వంద శాతం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. విలేకరులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులోనూ ఇదే సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

సీనియర్ పాత్రికేయుడు నబీ మాట్లాడుతూ.. తన 26 ఏళ్ల వృత్తి జీవితంలో జాతీయ పత్రికా దినోత్సవం రోజున విలేకరులను ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించడం ఇదే తొలిసారన్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆంక్షల నడుమ నిరంతరం ప్రజాసేవ చేస్తున్న పాత్రికేయులకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే నాయకులు చంద్రశేఖర్ రావు, సీనియర్ విలేకరులు కొండ శేఖర్, మారెన్న, చంద్రశేఖర్, ఓమెంద్ర, అమీర్, చిరంజీవి, నజీర్ అహ్మద్, ఈశ్వరయ్య, దస్తు, రాజశేఖర్, నజీర్, అంజి, రాజు, అశోక్, వీరేష్, హరి తదితరులు పాల్గొన్నారు.