ఒంగోలులోడిసెంబర్ 26న ఐఎల్పి పార్టీ 20వ వ్యవస్థాపక దినోత్సవ సభను జయప్రదం చేయండి.... ఐ ఎల్ పి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
మార్కాపురం కోర్టు సెంటర్లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఐ ఎల్ పి పార్టీ 20వ వ్యవస్థాపక దినోత్సవ సభను జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం మాట్లాడుతూ దళిత బహుజనులకు రాజ్యాధికారం ద్వారానే సమానత్వం స్వాతంత్రం హక్కులు లభిస్తాయని అందరము రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని ఒంగోలులో జరిగే ఐఎల్పి పార్టీ 20వ వ్యవస్థాపక సభను జయప్రదం చేయటానికి అందరు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి పార్టీ మార్కాపురం జిల్లా అధ్యక్షులు తూమాటి .వెంకటేశ్వర్లు కే. ముసలమ్మ దాసరి. దేవ సహాయం మంచ. సామేలు అక్కలి. శీను పెరికే. దానం తదితరులు పాల్గొన్నారు