అయ్యప్ప స్వామి సన్నిధిలో దారపనేని ప్రత్యేక పూజలు
పామూరు, మేజర్ న్యూస్ : కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ సోమవారం పామూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించి ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి కావిటి సుబ్బయ్య,పలువురు భక్తులు పాల్గొన్నారు.