BREAKING
బలిజేపల్లిలో కన్నుల పండువగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం --శివనామస్మరణతో మార్మోగిన మల్లేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ భారత జోన్ మహిళల చెస్ టోర్నమెంట్‌లో జీజీహెచ్‌ఎంసీ ఒంగోలు విద్యార్థిని ప్రతిభ పకడ్బందీగా సమ్మేటివ్ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు పుల్లగుమ్మి సర్పంచ్ అభ్యర్థిగా మురసాని నాగలక్ష్మమ్మ ఏకగ్రీవానికి సహకరించాలని మురసాని అజయ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి పిల్లల మాటకు విలువ ఇద్దాం.. వారి అభిప్రాయాలను గౌరవిద్దాం నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్ నాగాయగుంట సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి వడ్డీ నిర్మలమ్మ ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూసి ఉంచాలి : సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య పంచాయితీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి -ఆర్ఓ అనంతరాజు కృష్ణంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోతిరెడ్డి తిరుపతిరెడ్డి నామినేషన్ గ్రంధాలయ పితామహునికి నివాళులు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఉత్తమ అవార్డు ఈ నెల 19న నెల్లూరులో జిల్లాస్థాయి పారా క్రీడా ఎంపికలు - డి ఈ వో బాలాజీరావు 'మైసా' నుంచి 'ఏనాటి వరమో నువ్వు' సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న రష్మిక లుక్! గ్రంథాలయోద్యమ ప్రముఖులకు నివాళి కారు బోల్తా,నలుగురికి గాయాలు

డిజిటల్ యుగంలోనూ గ్రంథాలయాల ప్రాధాన్యతను చాటిన విద్యార్థులు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీ నిర్వహణ

Select Suryaa Now
డిజిటల్ యుగంలోనూ గ్రంథాలయాల ప్రాధాన్యతను చాటిన విద్యార్థులు  జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీ నిర్వహణ

రేపల్లె మేజర్ న్యూస్;
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతోపాటు గ్రంథాలయాల ప్రాధాన్యత, విజ్ఞాన సముపార్జనపై అవగాహన కల్పించేందుకు శ్రీ ఏ.బి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), రేపల్లెలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం  వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై విద్యార్థులకు పోటీ నిర్వహించి వారి ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సి. రవిచంద్ర కుమార్ మార్గదర్శకత్వంలో గ్రంథాలయ శాస్త్ర విభాగ ఇన్‌ఛార్జి డాక్టర్ ఎం. దాసు, సహాయ సిబ్బంది పి. సునీత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని డిజిటల్ యుగంలో గ్రంథాలయాల ప్రాముఖ్యత, ఆన్‌లైన్ వనరుల వినియోగం, డిజిటల్ పఠనం, సమాచార సేకరణలో గ్రంథాలయాల పాత్ర వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యాసాల రూపంలో వ్యక్తపరిచారు.మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా గ్రంథాలయాలు కూడా ఆధునిక రూపాన్ని సంతరించుకుంటున్నాయని, పుస్తక పఠనంతోపాటు డిజిటల్ సమాచార వనరులు విద్యార్థుల విజ్ఞానాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని ఈ కార్యక్రమం ద్వారా వివరించారు.విద్యార్థుల్లో పఠన సంస్కృతిని పెంపొందించడంతోపాటు పరిశోధనాత్మక దృక్పథం, సృజనాత్మక ఆలోచనా విధానం, విజ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని  తెలిపారు.