ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక
భూమా అఖిలప్రియ సమక్షంలో తెదేపాలో చేరిక
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; నియోజకవర్గంలోనిదొర్నిపాడు మండలం డబ్ల్యూ. గోవిందిన్నె గ్రామానికి చెందిన 20 కుటుంబాలు సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నీ వీడి తెదేపా లోచేరారు.శివప్రసాద్ పెద్ద బోయిన, బోనాల శంకరయ్య, బోనాల శివరామయ్య, సాంబశివరావు, కర్ణాటీ కృష్ణారెడ్డి, గుండుపాపల శంకరయ్య, శివ రాముడు, సాంబశివుడు, పెద్ద జనార్ధన్, ఓర్వకంటి శివయ్య, లక్ష్మయ్య, కొత్త దర్గా ఆలీషా, వీరితోపాటు 20 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలోకి రావడం జరిగింది .ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాలూకాలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి, సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాలను చూసి ఆళ్లగడ్డ మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని వైసీపీ నుండి టిడిపిలోకి రావడం జరిగిందన్నారు.పార్టీలోకి వచ్చిన వారిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సానుకూలంగా స్వాగతిస్తూ టిడిపి కండువా కప్పడం జరిగింది.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా