తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా క్రీడా పోటీలు
సంగారెడ్డి, ప్రతినిధి ; తెలంగాణ రాష్ట్రంలో 2026 డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించ నున్న ఖేలో ఇండియా క్రీడా పోటీలకు సంబంధించి రూపొందించిన అధికారిక లోగో, మస్కట్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంగారెడ్డిలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు జాతీయ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా వంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకొని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ఖేలో ఇండియా క్రీడా పోటీల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, క్రీడల పట్ల యువతలో అవగాహన, ఆసక్తి పెంపొందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి అఖిలేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.