telangana
మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం
సూర్య,భీమ్‌గల్ : భీమ్‌గల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ బొదిరే నాగమణి స్వామి తెలిపారు. ఇందులో భాగంగా TUFIDC నిధులతో భీమ్‌గల్ పురపాలక సంఘం పరిధిలోని ఆరో వార్డులో చేపట్టనున్న నూతన మురికి కాలువల నిర్మాణ పనులను ఆమె కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నూతన డ్రైనేజీ కాలువలు, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, వైస్ చైర్‌పర్సన్ చంటి లత నర్సయ్య, కౌన్సిలర్లు శ్రీజ నాగేంద్ర, తోట సతీష్, అంజుమ్ అలీ, సందీప్, సంగ్యా నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్స అనంతరావు, కాంగ్రెస్ నాయకులు చెప్ప గణేష్, మొండి దినేష్, నవీన్, నల్లూరు గంగామణి, ఆరో వార్డు నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.