telangana
అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సూర్య, నాగిరెడ్డి పేట్: అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సోమవారం లింగంపేట్ మండల కేంద్రం సమీపంలోని జీఎన్ఆర్ గార్డెన్స్‌లో లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన 1,784 మంది నూతన పెన్షన్ లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. లింగంపేట్‌లో 643, ఎల్లారెడ్డి మండలం, మున్సిపాలిటీలో 661, నాగిరెడ్డిపేట మండలంలో 480 కుటుంబాలకు పెన్షన్లు మంజూరయ్యాయి. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా బాధితులకు ఈ పెన్షన్లు ఆర్థికంగా అండగా నిలవనున్నాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాండూర్ సొసైటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్ సురేందర్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మురళీమోహన్ గౌడ్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు సాయ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.