BREAKING
నా ఓటు.. నోటుకు కాదు ! రూ.500 నోట్లను బ్యాలెట్ బాక్స్‌లో వేసిన ఓటరు ఒకేరోజు బాక్సాఫీస్ పోరు.. మమ్ముట్టి 'ఓం' వర్సెస్ దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'! పొదిలి నగర ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నాం - మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఇరాక్ కేంద్రంగా అక్రమ చమురు రవాణా మానం రాజేశ్వరి నామినేషన్‌కు భారీ ర్యాలీ అట్టహాసంగా ఆనంగి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సీఐ తిమ్మయ్య. ఆదిత్యలో ఏఐ ఫండమెంటల్స్,డిజైన్ థింకింగ్స్ అంశంపై వర్క్ షాప్ : పలు అంశాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన 'ఐ హేట్ మ్యారేజ్' ట్రైలర్ రిలీజ్.. నేటి తరం యువత ఆలోచనలతో ఆకట్టుకుంటోంది! రైతులకు శిక్షణ. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న బాంకో బీపీఎం సీఈఓ మానం రాజేశ్వరికి నామినేషన్ పత్రాలు అందజేసిన దారపనేని ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో వరుణ హోమం – రైతులను ఆదుకోవాలని వరుణ దేవునికి ప్రత్యేక పూజలు పెద్ద కలలు, ప్రేమ, ఊహించని మలుపులు.. 'టీన్ తిగడా' ట్రైలర్ రిలీజ్! గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో 'లఖ్‌పతి దీదీ' పథకం కీలక పాత్ర

శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత

Select Suryaa Now
శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత

తిరుపతి మేజర్ న్యూస్:

హిందువుల ఇంట కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటాల వెనుక ఉన్న అద్భుత కళాకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ వయోభారంతో (86) ఇటీవల కన్ను ముశారు. ఆయన మృతి పట్ల భక్తులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని తన కుంచెతో చిత్రించి, కోట్లాది భక్తుల పూజా మందిరాల్లో కొలువు దీరేలా చేసిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసన్. తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్,  ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద చిత్రకళలో శిక్షణ పొందారు. 1970లో టీటీడీ ఆహ్వానం మేరకు తిరుమల ఆలయ గర్భగుడిలోకి వెళ్లి, మూల విరాట్టును ప్రత్యక్షంగా దర్శించి స్వామి వారి దివ్య రూపాన్ని చిత్రించారు. ఆయన రూపొందించిన శ్రీవారి చిత్రం కాలక్రమంలో క్యాలెండర్లు, చిత్రపటాల రూపంలో దేశ విదేశాల్లోని భక్తుల ఇళ్లలో పూజలు అందుకుంటోంది. కళాకారుడు దూరమైనా, ఆయన కుంచెతో చిత్రించిన శ్రీవారి దివ్యరూపం మాత్రం తరతరాలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతుంది.

ఎస్. నగేష్ ప్రత్యేక ప్రతినిధి