సర్వేపల్లి–రాపూరు యూనిట్‌కు నూతన కార్యవర్గం ఎన్నిక
పొదలకూరు, మేజర్ న్యూస్ : ప్రైవేటు పాఠశాలల అభివృద్ధి, యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అపుస్మా సభ్యులంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆ సంఘ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం.వి. సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని వరదాపురం శ్రీ సాయినాథ హైస్కూల్‌లో అపుస్మా సర్వేపల్లి–రాపూరు యూనిట్ సర్వసభ్య సమావేశం రాపూరు యూనిట్ అధ్యక్షుడు బి. మునీంద్రరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.సమావేశంలో సంఘం ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఎంఎంటీఎస్‌ఈ, శాట్ పరీక్షలు, మనోహర్‌రెడ్డి మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్లపై చర్చించారు. ప్రైవేటు పాఠశాలల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, విద్యా ప్రమాణాల పెంపు, సంఘాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై సభ్యులు అభిప్రాయాలు వెల్లడించారు.అనంతరం రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం.వి. సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు కొండారెడ్డి పర్యవేక్షణలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా కె. సురేష్, అధ్యక్షుడిగా బి. శివకుమార్, కార్యదర్శిగా డి. శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా పి. పుల్లయ్య, ఉపాధ్యక్షుడిగా ఎం. మునిప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా పి. కోదండరాం ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా యూసీ పెంచలయ్య, ఎండీ గౌస్, అంకయ్యలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఎం.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి సమష్టిగా పోరాడాలని సూచించారు. విద్యాసంస్థల అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, ఎడిఫై పాఠశాల కరస్పాండెంట్, పలువురు పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.