జాతీయ రహదారి భద్రత మండలి సభ్యునిగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి
జాతీయ రహదారి భద్రత మండలి సభ్యునిగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి
*జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఘన సన్మానం
తిరుపతి బ్యూరో,మేజర్ న్యూస్:
కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ లో నాన్-ఆఫీషియల్ కో-ఆప్టెడ్ సభ్యునిగా తిరుపతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి నియమితులైన సందర్భంగా తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులు ఆయనను దుశ్శాలువతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ప్రత్యేకించి తిరుపతి నగరానికి చెందిన వ్యక్తికి జాతీయ స్థాయిలో ఇటువంటి కీలకమైన బాధ్యత లభించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.రహదారి ప్రమాదాల నివారణ, ప్రమాదాల విశ్లేషణ, రహదారి భద్రతా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాల్లో జాతీయ స్థాయిలో విధానపరమైన సూచనలు అందించే అత్యున్నత సలహా మండలిలో తిరుపతి ప్రాంతానికి ప్రాతినిధ్యం లభించడం విశేషమన్నారు.రహదారి ప్రమాదాలు కేవలం వాహనాల సంఖ్య పెరగడం వల్లనే కాకుండా, మానవ తప్పిదాలు, రహదారి నిర్మాణ లోపాలు, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రహదారి నియమాల పట్ల అవగాహన లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల జరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రమాదాల స్వభావాన్ని అధ్యయనం చేసి, వాటి నివారణకు అవసరమైన సూచనలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సూర్యనారాయణ రెడ్డి భాగస్వామ్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సభ్యునిగా ప్రమాదాల విశ్లేషణ, దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలు, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలు, బ్లాక్ స్పాట్స్ తదితర అంశాలపై అధ్యయనం చేసి నివారణ చర్యలకు సూచనలు అందించడం, రోడ్డు ఇంజనీరింగ్ మెరుగుదల అంశాలపై పోలీసు, రవాణా, జాతీయ రహదారుల సంస్థ,వైద్య ఆరోగ్యశాఖ,విద్యాశాఖ తదితర విభాగాల మధ్య సమన్వయంతో ప్రమాదాల నివారణకు కార్యాచరణ రూపకల్పనకు తగు సూచనలు అందించడం జరుగుతుందని మబ్బు సూర్యనారాయణ రెడ్డి తెలియ చేశారు
ఈ బాధ్యత ద్వారా తిరుపతి జిల్లాలోని క్షేత్రస్థాయి రహదారి భద్రతా సమస్యలు, ప్రమాదాల విశ్లేషణ, ప్రజల అభిప్రాయాలు, ఆచరణాత్మక పరిష్కారాలను జాతీయ స్థాయి చర్చలకు తీసుకెళ్లేందుకు ఒక మంచి అవకాశం లభించిందని జిల్లా రవాణా శాఖాధికారి పేర్కొన్నారు.ఈ అభినందన కార్యక్రమంలో జిల్లా మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, స్వర్ణలత, ప్రసాద్ వర్మ, పరిపాలన అధికారులు విజయ్ కుమార్, విజయ ప్రశాంతి, రవాణా శాఖ సిబ్బంది పాల్గొని మబ్బు సూర్యనారాయణ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,