మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్
సూర్య ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మండలంలోని మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ చేశారు గ్రామసర్పంచి పుట్ల చంద్రశేఖర్ చేతుల మీదుగా లింగంపేట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన ఏడు మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ“పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం. అని తెలిపారు గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అన్ని విధాలా సహకారం అందిస్తాను. గ్రామంలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మౌలాన్ ఖేడ్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటాను” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాహిర బేగం, ఎం పి ఓ రహీం, గ్రామ పంచాయతీ సెక్రెటరీ వెంకట లక్ష్మి గ్రామస్తులు రేణుక సుశీల ఎల్లవ్వ సుగుణవ, కిషన్, సాయవ్వ, సుజాత , తదితరులు పాల్గొన్నారు