BREAKING
కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య ఫోటో రైటర్: 1 లక్ష్మయ్య ఫైల్ ఫోటో కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ స ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలి: సీఐ జి. ప్రసాద్ రావు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి ఐపీవో నిబంధనల సరళీకరణకు సెబీ కీలక నిర్ణయం ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ పొదలకూరులో ఘనంగా కోటి సోమవారం వేడుకలు.. కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత రైతాంగాన్ని పీడిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం వాల్ స్ట్రీట్ ట్రెండ్స్ మరియు అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై తాజా విశ్లేషణ మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన ఐస్‌లాండ్‌లో సరికొత్త పర్యాటక సాహసం ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం విద్యార్థులు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

దేవన్‌పల్లి క్వారీలను శాశ్వతంగా మూసివేయాలి

Select Suryaa Now
దేవన్‌పల్లి క్వారీలను శాశ్వతంగా మూసివేయాలి
సూర్య,భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలం దేవన్‌పల్లి గ్రామ పరిధిలో కొనసాగుతున్న క్వారీలను శాశ్వతంగా మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డిజైనర్ రాక్, జంబో రాక్ పేర్లతో క్వారీలను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో గ్రానైట్ కోసం తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ తవ్వకాల వల్ల గ్రామంలో పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని సుదర్శన్ టాకీస్ నుంచి గ్రామస్తులు ర్యాలీగా బయలుదేరి క్వారీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజావాణి కార్యక్రమానికి చేరుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు అందజేసి క్వారీలను శాశ్వతంగా మూసివేయాలని కోరారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వారీల్లో భారీ స్థాయిలో తవ్వకాలు జరపడంతో ఏర్పడిన లోతైన గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉంటోందని, ఆ నీటిని క్వారీ నిర్వాహకులు మోటార్ల ద్వారా తోడి కాలువల్లోకి వదులుతున్నారని తెలిపారు. దీనివల్ల భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామ పరిసర ప్రాంతాల్లో తాగునీరు, సాగునీటి సమస్యలు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు.మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే పరిస్థితుల్లో ఇలాంటి భారీ తవ్వకాలు భవిష్యత్తులో రైతులకు, గ్రామ ప్రజలకు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. క్వారీల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కారణంగా గ్రామస్తులు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా గ్రానైట్ రవాణా కోసం భారీ వాహనాలు నిరంతరం రాకపోకలు సాగించడంతో గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని, క్వారీల్లో చేపడుతున్న భారీ పేలుళ్ల కారణంగా సమీపంలోని ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. పేలుళ్ల శబ్దాలు, వాహనాల రాకపోకలు, దుమ్ము ధూళితో ప్రజలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి నెలకొందని వాపోయారు.
*క్వారీలపై సమగ్ర విచారణ చేపట్టాలి*
దేవన్‌పల్లి గ్రామ పరిసరాల్లోని క్వారీలకు మంజూరైన అనుమతులు, పర్యావరణ అనుమతులు, పేలుళ్ల నిర్వహణ, భూగర్భ జలాల వినియోగం, తవ్వకాల పరిమితులపై సంబంధిత శాఖల అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, పర్యావరణం, భూగర్భ జలాల పరిరక్షణ దృష్ట్యా దేవన్‌పల్లి గ్రామ పరిధిలోని క్వారీలను శాశ్వతంగా మూసివేయాలని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే క్వారీలు మూసివేసే వరకు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.