BREAKING
కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య ఫోటో రైటర్: 1 లక్ష్మయ్య ఫైల్ ఫోటో కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ స ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలి: సీఐ జి. ప్రసాద్ రావు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి ఐపీవో నిబంధనల సరళీకరణకు సెబీ కీలక నిర్ణయం ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ పొదలకూరులో ఘనంగా కోటి సోమవారం వేడుకలు.. కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత రైతాంగాన్ని పీడిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం వాల్ స్ట్రీట్ ట్రెండ్స్ మరియు అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై తాజా విశ్లేషణ మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన ఐస్‌లాండ్‌లో సరికొత్త పర్యాటక సాహసం ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం విద్యార్థులు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు

Select Suryaa Now
పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి  ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు

మంగళగిరి, మేజర్‌న్యూస్‌ :

రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిలో మార్పు రావడం లేదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విమర్శించారు. అధికారం ఉన్నా, లేకపోయినా చట్టాలను ఉల్లంఘించడం, దౌర్జన్యాలకు పాల్పడటం, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం గొడ్డలి పార్టీ నేతలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అజెండా ఏంటో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్థమైంది. దౌర్జన్యం, దోపిడీ, అరాచకం సృష్టించడం, తమకు అడ్డువచ్చిన వారిని అణచివేయడం, ఆస్తులను విధ్వంసం చేయడం వంటివి వారి దినచర్యలో భాగమైపోయాయి. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని పేర్కొన్నారు. ఇప్పటికే 19 కేసులు ఉన్న నిందితుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఓట్లతో నిండి ఉన్న బ్యాలెట్ బాక్స్‌ను అక్రమంగా తన స్వాధీనంలో ఉంచుకున్నారు. దీనిని అడ్డుకోబోయిన పోలింగ్ ఆఫీసర్లు, సెక్యూరిటీ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. ఈ చట్టవ్యతిరేక చర్యపై పోలీసులు కేసు నమోదు చేయగా, న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కలిసేందుకు జైలు నిబంధనల ప్రకారం కేవలం అనుమతి ఉన్న ఒకరిద్దరిని మాత్రమే లోపలికి పంపిస్తారు. కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన అనుయాయులు నిబంధనలను తుంగలో తొక్కి పెద్ద ఊరేగింపుగా వచ్చి, కాన్వాయ్ మొత్తాన్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం వారిని అడ్డుకోబోయిన పట్టాభిపురం ఎస్ఐ రామాంజనేయులు గారిపై దాడి చేసి గాయపరచడం అత్యంత దారుణం. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపైనే ఇలా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. 
ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్న వైసీపీ
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలకు, నియమ నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వైసీపీ నాయకులు, అందుకు విరుద్ధంగా అధికారులపై దాడులకు పాల్పడటం అత్యంత దారుణమని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విమర్శించారు. రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావంతో పాటు, ఇటీవల రెండుసార్లు సంభవించిన తుఫానుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి బిక్కుబిక్కుమంటున్నారు. ఒక రాజకీయ పార్టీగా ప్రజల మధ్య ఉండి, ఆ బాధితులను పరామర్శిస్తూ ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వైసీపీ నేతలు, అందుకు భిన్నంగా కేసుల్లో ఇరుక్కున్న నిందితులను పరామర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. గతంలో సత్తెనపల్లిలో బెట్టింగ్ రాజాను పరామర్శించే క్రమంలో పోలీసుల సూచనలను బేఖాతరు చేస్తూ కాన్వాయ్ నడపడం వల్ల సింగయ్య అనే దళిత కార్యకర్త ప్రాణాలు కోల్పోయారని, పిడుగురాళ్లలోనూ ఇటువంటి ఘటనలే పునరావృతమయ్యాయని ఆయన గుర్తు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కనీస క్రమశిక్షణ నేర్పించాలని, చట్టాన్ని గౌరవించేలా వారికి దిశానిర్దేశం చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో ఓటు వేయకుండా ధర్నాలు చేయడం, నామినేషన్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వందలాది మందితో లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడం, అడ్డుకున్న అధికారులపై దౌర్జన్యానికి దిగడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. 
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ, వైసీపీ నాయకులకు పలు ప్రశ్నలు సందిస్తూ.. ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తి అయిన 'ప్రజా వేదిక'ను ఏ కారణంతో కూల్చివేశారు?, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను ఎందుకు వేధింపులకు గురిచేశారు?, మద్యం ధరల గురించి ప్రశ్నించిన ఓంకార్ మరణానికి, ఇసుక ధరలపై ప్రశ్నించిన వరప్రసాద్‌కు శిరోముండనం చేయడానికి కారణం ఏమిటి?, తెలుగుదేశం పార్టీ జెండాను దించనందుకు చంద్రయ్యను నడిరోడ్డుపై హత్య చేయడానికి దారితీసిన పరిస్థితులేంటి? గతంలో జరిగిన ఈ ఘటనలన్నింటినీ విస్మరించి, నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం వైసీపీ నేతలకు తగదని, ఇకనైనా చట్టానికి లోబడి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే బూర్ల హితవు పలికారు.  
బాధితులను వదిలి నిందితులను పరామర్శించడం వైసీపీకే చెల్లింది 
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలకు, నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సిన వైసీపీ నేతలు, దౌర్జన్యాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించాలని చూడటం సరికాదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హితవు పలికారు. నిందితుడిని పరామర్శించే పేరుతో జైలు నిబంధనలను ఉల్లంఘించి, పోలీసు అధికారులను గాయపరచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ నేతల మీద మాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు. ప్రజాస్వామ్యం పది కాలాల పాటు వర్ధిల్లాలంటే ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించాలి. కానీ, తాము చెప్పిందే జరగాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే మాత్రం ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. లేళ్ల అప్పిరెడ్డిపై ఇప్పటికే 19 కేసులు ఉన్నాయని, ఆయన నిర్దోషి అయితే పార్టీ తరఫున న్యాయపరంగా నిరూపించుకోవాలని సూచించారు. గతంలో రైతులకు ఉపయోగపడే మిర్చి యార్డ్ దగ్ధం ఘటన, కోల్డ్ స్టోరేజీల బాగోతాలు, సొసైటీలు, డ్వాక్రా సంఘాల్లో అక్రమాలు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దౌర్జన్యం వంటి కేసుల్లో ఆయన పేరు వినిపించిందని గుర్తు చేశారు. ఇటీవల స్వయంగా తన అనుచరులతో వచ్చి బ్యాలెట్ బాక్స్‌ను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం వల్లే పోలీసులు కేసు నమోదు చేశారని, న్యాయస్థానం రిమాండ్ విధించిందని పేర్కొన్నారు. పార్టీ నాయకుడిని పరామర్శించడానికి వెళ్లినప్పుడు జైలు నిబంధనలు, అధికారులు విధించే షరతులకు లోబడి వ్యవహరించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు, ములాఖత్‌లకు వెళ్లిన నాయకులంతా అత్యంత క్రమశిక్షణతో, పద్ధతిగా వ్యవహరించారే తప్ప ఎక్కడా దౌర్జన్యాలకు పాల్పడలేదని, అధికారులను గాయపరచలేదని చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి, అడ్డువచ్చిన అధికారులపై దాడులు చేయడం ద్వారా వైసీపీ నేతలు నేరాలకు పాల్పడిన వారవుతారు తప్ప, ప్రజా క్షేమం కోరే నాయకులు కాలేరని అన్నారు. ఇలాంటి చర్యల ద్వారా భావితరాలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారో వైసీపీ నాయకులే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. ఇకనైనా వైసీపీ నేతలు ఇలాంటి దౌర్జన్యాలను మానుకుని, తప్పు చేసిన నిందితుల కోసం కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాడాలని, నిజమైన బాధితులను పరామర్శించాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సూచించారు.