పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఈ నెల 29వతేదీన నిర్వహించబోయే గ్రామపంచాయతీ ఎన్నికల నిమిత్తం నువ్వురుపాడు గ్రామపంచాయతీలోని వార్డ్ నెంబర్ నాలుగు అంబేద్కర్ కాలనీలో గల పోలింగ్ స్టేషన్ను మార్పుచేశామని ఎంపిడివో పి. రఫీఖాన్ తెలిపారు.గతంలో తాత్కాలిక పోలింగ్ స్టేషన్ గా ఏర్పాటు చేయడం జరిగిందని,కానీ భారీ వర్షాలు హెచ్చరికలు ఉన్నందున సదరు తాత్కాలిక పోలింగ్ స్టేషను అదే అంబేద్కర్ కాలనీలోని దివానపు శ్రీధర్కు చెందిన ప్రైవేట్ ఇంటిలోకి మార్చడం అయినదన్నారు. కావున వార్డు నెంబర్ 4 అంబేద్కర్ కాలనీ నువ్వురుపాడు ఓటర్లు ఈ విషయాన్ని గమనించగలరని ఎంపీడీవో రఫీఖాన్ తెలియజేశారు.