BREAKING
పిల్లల ప్రజావాణికి విశేష స్పందన – 148 ఫిర్యాదులు స్వీకరణ అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ కరెన్సీ దూకుడు కనగల్ ఎస్సైగా ఎం లక్ష్మయ్య ఫోటో రైటర్: 1 లక్ష్మయ్య ఫైల్ ఫోటో కనగల్ మేజర్ న్యూస్: కనగల్ మండల ఎస్సైగా ఎం. లక్ష్మయ్య నూతనంగా బాధ్యతలను సోమవారం చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న కే. రాజీవ్ రెడ్డికి నల్గొండ విఆర్ కు బదిలీ చేశారు. నూతనంగా నియమించబడిన లక్ష్మయ్య నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. ఈ స ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలి: సీఐ జి. ప్రసాద్ రావు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలి ఐపీవో నిబంధనల సరళీకరణకు సెబీ కీలక నిర్ణయం ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ పొదలకూరులో ఘనంగా కోటి సోమవారం వేడుకలు.. కౌటాలలో మాలి సంఘ సమావేశం - భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చ రొంపిచెర్లలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. శ్రీవారి చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత రైతాంగాన్ని పీడిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం వాల్ స్ట్రీట్ ట్రెండ్స్ మరియు అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై తాజా విశ్లేషణ మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన ఐస్‌లాండ్‌లో సరికొత్త పర్యాటక సాహసం

నామినేషన్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

పెద్దపంజాణి, మేజర్ న్యూస్:
నామినేషన్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి పలమనేరు ఆర్డిఓ భవాని సూచించారు. పెద్దపంజాణి మండలం రాయలపేటలోని  గ్రామపంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు నవంబర్ 17 మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు, నామినేషన్లను స్వీకరిస్తారని,ఆయా నామినేషన్ కేంద్రాల వద్ద నవంబర్ 18వ తేదీ ఉదయం 8 గంటల నుండి నామినేషన్ల  పరిశీలన 
రిటర్నింగ్ అధికారులు నిర్వహిస్తారన్నారు. తిరస్కరించబడిన  నామినేషన్ల పై అప్పిలేట్ అధికారి అయిన రెవిన్యూ డివిజనల్ అధికారి కి నవంబర్ 19వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అప్పీలు అవకాశం ఉంటుందని, నవంబర్ 20వ తేదీన అప్పీల్స్ పరిష్కారం అప్పిలేట్ అధికారి ద్వారా ఉంటుందని ఆర్డీవో పేర్కొన్నారు.నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారని,  అనంతరం పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు.నవంబర్ 26వ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, అదే రోజే మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు జరిపి  ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని ఎంపీడీవో బాలాజీ తెలిపారు.కాగా మండలంలోని ఆరు నామినేషన్ కేంద్రాలను ఎంపీడీఓ బాలాజి
తాసిల్దార్ రామ్మూర్తి,  డిప్యూటీ ఎంపీడీవోలు శారదా దేవి, సుధాకర్ రావు పరిశీలించి, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి 
ఆయా పంచాయతీ కార్యదర్శులు స్వర్ణ గ్రామ సిబ్బంది కి విధులు కేటాయించారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి