BREAKING
కార్పొరేట్ రంగంలో కొత్త నిబంధనల భారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ నామినేషన్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి యుద్ధ వాతావరణం నీడలో సౌదీ అరేబియా 'విజన్ 2030' భవిష్యత్ ఎల్ నినో ప్రభావం పై రైతులకు శిక్షణ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి దివ్యాంగ బాలల దినోత్సవ వేడుకలు మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం ఏ ఎస్ పేట, సంగం,చేజర్ల మండలాల ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో మంత్రి ఆనం సమావేశం నేడే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కనీస క్రమశిక్షణ నేర్పించాలి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సార్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు, హెచ్.ఐ.వి అవగాహన సదస్సు. వైభవంగా అంకురార్పణ పూజా నిర్వహణ పోలింగ్ కేంద్రం మార్పు -ఎంపిడివో మౌలాన్ కేడ్ కు చెందిన 7 గురికి పెన్షన్ పత్రాలను అందించిన సర్పంచ్ పుట్ల చంద్రశేఖర్  డబుల్ ఈగిల్ ఆస్తుల కొనుగోలుకు రూ. 50 వేల కోట్ల భారీ ఒప్పందం

ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ

Select Suryaa Now
ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ

ఆత్మకూరు,  మేజర్ న్యూస్ :   ఆత్మకూరు సీమ ప్రాచీన కాలం నుండి చరిత్ర ప్రసిద్ధమైన పేరుగా ఇక్కడ అనేక ప్రాధాన్యత అంశాలు, మహిమాన్వితాలు బోలెడు ఉన్నట్లుగా కథలుగా చెబుతుంటారు. పురాతనములో చారిత్రాక ప్రసిద్ధి చెందిన ఆత్మకూరు సీమలో ఎన్నో అవశేషాలు, చరిత్రలు, అలనాటి విశేషాలు,వింతలు, విడ్డూరాలు ఉండగా ప్రజల సంక్షేమం ధ్యేయంగా తన ప్రాణాల్ని తృణప్రాయంగా విడిచిపెట్టిన వీరనారి ఉదంతం కూడా ఇక్కడ చోటు చేసుకోవడం విశేషం. ప్రజల ప్రయోజనం ప్రధానమని భావించి తన ప్రాణాలనే అర్పించిన వీరనారి గొల్లభామ చరిత్రపుటల్లో నిలిచిపోయింది.ఆత్మకూరు ప్రాంతంలోనే కాకుండా జిల్లాలోనే పెద్ద చెరువుల్లో ఒకటిగా ఉండే అనంతసాగరం చెరువు కట్టపై శిలా విగ్రహంగా దర్శనమిచ్చే గొల్లభామ త్యాగనిరతి అనితర సాధ్యమని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. విజయనగర రాజుల్లో ప్రముఖుడైన శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో మహామంత్రి తిమ్మరుసు నిర్మించబడిన అనంత సాగరం చెరువు కట్ట నిర్మాణ సమయంలో గండిపడగా గండిని పూర్చేందుకు ఆత్మార్పణం చేసుకున్న గొల్లభామ వీర వనితగా కట్టపైన విగ్రహంగా ఏర్పాటు చేయబడి నేటికీ పూజలు గావిస్తున్నారు. క్రీస్తు శకం 1520 సంవత్సరంలో అనంత సాగరం చెరువు నిర్మించే సమయంలో సంఘటిల్లిన ఆత్మ త్యాగ గాధ ఇది. చెరువు కట్ట నిర్మిస్తుండగా ఒక చోట గండి పడిందని, దాన్ని పూడ్చడానికి అలివిగాని పరిస్థితుల్లో తనకు మానవ బలి కావాలన్నా అశరీరవాణి పలికినట్లుగా పెద్దలు చెబుతుంటారు. ఆ సమయంలో అనంతసాగరం చెందిన యాదవాంగన గొల్లభామ ధైర్యంగా వచ్చి ఆ గండిలో నిలబడగా వరద ప్రవాహం నిలిచిపోయిందని, గొల్లభామ అసువులు బాసి ప్రాణత్యాగిగా నిలిచిందని పెద్దలు చెబుతుంటారు. ప్రజా శ్రేయస్సే పరమావదిగా భావించిన శ్రీకృష్ణదేవరాయల మంత్రి తిమ్మరుసు ప్రజా సౌకర్యార్థం చెరువులను, బావులను నిర్మించార,ని అనంతసాగరం ప్రాంతంలో వెలిగొండలో పుట్టి పెన్నా నదిలో కలిసే కేతామన్నేరులో నీటిని సద్వినియోగం చేసి ప్రజలను ఆదుకోవాలని తలంపుతో చెరువు కట్ట నిర్మాణానికి శాలివాహన శకం 1442 విక్రమ సంవత్సర జ్యేష్ట పౌర్ణమి నాడు నాంది పలుకుగా శ్రీకృష్ణదేవరాయలు కార్యకర్త రాయసం కొండ మురసయ్య తన తల్లిదండ్రులు శాంకాయమ్మ తిమ్మరుసు గార్ల పుణ్యం కోసం తటాకం నిర్మించారని నేటికీ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. సైనికులు సోమరులుగా ఉండటం ఇష్టం లేక వారిని, ఏనుగులను ఉపయోగించి తటాకం నిర్మించారని కూడా చెబుతుంటారు. నాడు తటాకం గండిని పూడ్చెందుకు ఎంతగా యత్నించినా అలివికాని సమయంలో ఆకాశవాణి పలుకుల మేరకు ఆత్మ బలిదానం గావించిన యాదవాంగన జ్ఞాపకార్థం చెరువు కట్టపై ఆనాడే గొల్లభామ శిలువను విగ్రహంగా మార్చారని చెబుతుంటారు. కాగా ఇంత ప్రాధాన్యత కలిగిన గొల్లభామ విగ్రహం అడుగున గుప్త నిధులు ఉంటాయని భావించిన కొందరు 2003 వ సంవత్సరంలో ఆగస్టులో అర్ధరాత్రి ప్రోక్లేయిన్ తో పెకలించసాగగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వెళ్లడంతో దుండగులు పారిపోగా ప్రోక్లైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నేలకొరిగిన గొల్లభామ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించకుంటే ఆనర్ధకమని అందరూ ఆందోళన చెందసాగ గా స్పందించిన అప్పటి ఆత్మకూరు ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య నాయుడు భూరి విరాళం అందజేయగా 2003 నవంబర్లో విగ్రహాన్ని పునః ప్రతిష్టించారు. బొల్లినేని కృష్ణ నాయుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి, అప్పటి అనంతసాగరం జడ్పిటిసి మెంబర్ బుట్టి వెంకట కృష్ణారెడ్డి, ఎంపీపీ బుట్టి లీలావతమ్మ, సాగునీటి సంఘం అధ్యక్షుడు చిలక సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో విగ్రహ పునఃప్రతిష్ట గావించగా నాటి నుండి తరచు గొల్లభామ విగ్రహం వద్ద పూజలు సాగిస్తుంటారు. ఈ ప్రాంత యాదవులు తమ కోర్కెలు ఫలించేందుకు గొల్లభామ విగ్రహం వద్ద పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటుంటారు.