BREAKING
ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు లైబ్రరీ నిర్వహణపై మాజీ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.వి. దుర్గాప్రసాద్ ప్రశంసలు సకల దోషహరం.. కార్తీక సత్యనారాయణ వ్రతం! ప్రజా ప్రయోజనం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరనారి గొల్లభామ అంక్సాపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలక దినోత్సవం ఎల్లారెడ్డి ప్రజావాణికి ఒక ఫిర్యాదు సౌత్ క్యాంపస్ లో బోరు తవ్వకాలకు భూమి పూజ నిర్వహించిన సుభాష్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మహిళ కౌన్సిల్ అభ్యర్థికి అస్వస్థత ఇకపై 19 కులాల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కృషి బుగెన్‌విల్లే మైనింగ్ బాధ్యతలపై రియో టింటో చారిత్రాత్మక నిర్ణయం రైతులు వరికి బదులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏ డి ఏ అపర్ణ కావలిలో ముగిసిన నామినేషన్ల పర్వం.. వేడెక్కిన ఎన్నికల సమరం. తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం తిరుపతి కపిలేశ్వరాలయంలో శ్రీ దక్షిణామూర్తి హోమం

'కెరూబ్' ట్రైలర్ అదుర్స్.. మన అడవుల్లో తీసిన 'అవతార్'లా ఉందన్న డైరెక్టర్ సముద్ర!

Select Suryaa Now
'కెరూబ్' ట్రైలర్ అదుర్స్.. మన అడవుల్లో తీసిన 'అవతార్'లా ఉందన్న డైరెక్టర్ సముద్ర!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఖుషీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విహాన్ కార్తీక్ హీరోగా, ఎంజే నాయుడు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కెరూబ్. గత, వర్తమాన, భవిష్యత్తు అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రానికి సత్య రాధాకృష్ణ సంగీతం అందించగా, రమేష్ తోకల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, టీజర్, ట్రైలర్ చూడగానే మన తెలంగాణ అడవుల్లో చిత్రీకరించిన అవతార్ సినిమా చూసిన అనుభూతి కలిగిందని ప్రశంసించారు. మన రాష్ట్రంలో ఇంతటి అందమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలిగిందని, ఈ సినిమా మరో రామాయణం అంతటి ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో విహాన్ కార్తీక్ ఎంతో అందంగా మరో విజయ్ దేవరకొండ, నానిలా కనిపిస్తున్నారని, ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని కొనియాడారు.

దర్శకుడు, నిర్మాత ఎంజే నాయుడు మాట్లాడుతూ, దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘ కల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ సినిమాను పూర్తి చేయగలిగానని భావోద్వేగానికి లోనయ్యారు. తన చిన్ననాటి స్నేహితుడైన సినిమాటోగ్రాఫర్ రమేష్ తోకల, ఆర్ట్ డైరెక్టర్, గీత రచయిత అలరాజు, సంగీత దర్శకుడు సత్య రాధాకృష్ణ, తమ్ముడిలాంటి హీరో విహాన్ కార్తీక్ సహకారంతో అనుకున్న విధంగా సినిమాను తీర్చిదిద్దామని తెలిపారు. ఈ నెల 20న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

హీరో విహాన్ కార్తీక్ మాట్లాడుతూ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగుపెట్టానని, ఒక కొత్త ముఖం కావాలని దర్శకుడు తనను ఎంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గత ఏడేళ్లుగా దర్శకుడితో కలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయాణిస్తున్నానని, ఆ కష్టానికి ఫలితం ఈ నెల 20న వెండితెరపై కనిపిస్తుందని అన్నారు. సంగీత దర్శకుడు సత్య రాధాకృష్ణ, సినిమాటోగ్రాఫర్ రమేష్ తోకల మాట్లాడుతూ, రాత్రి వేళల్లో ఎంతో శ్రమించి అద్భుతమైన విజువల్స్, సంగీతాన్ని అందించామని, థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆస్వాదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.