BREAKING
కుల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం.. ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం దేశానికి సైనికులు ఏ విధంగా కష్టపడతారో స్కౌట్ మాస్టర్,గైడ్ క్యాప్టెన్ కూడా సైనికుడిగా తయారు చేయాలి ---మెదక్ జిల్లా విద్యాధికారి రాజు 'హే కన్నమ్మ' టీజర్ రిలీజ్.. ప్రేమకథతో ఆకట్టుకుంటున్న యశ్వంత్, ధనశ్రీ వర్మ! ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జెన్సన్ హువాంగ్ శకం ముగిసిన తర్వాత ఎన్విడియా తొలి సమావేశం గ్లోబల్ ఈక్విటీలపై మోర్గాన్ స్టాన్లీ సానుకూల దృక్పథం ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ భారీ ఊరట ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి 'ది మేజ్' ట్రైలర్ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ అవుతుందన్న రాహుల్ రవీంద్రన్! జర్మనీలో ఇంధన భారాన్ని తగ్గించే దిశగా కీలక అడుగు మొక్కల నాటడంపై రైతులకు అవగాహన ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రకటన మలక వేమల సర్పంచ్ స్థానానికి నామినేషన్ సమర్పిస్తున్న సుభాషిని

నన్ను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వెనక్కి తగ్గలేదు.. దిల్జీత్ దోసాంజ్ సంచలన వ్యాఖ్యలు!

Select Suryaa Now
నన్ను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వెనక్కి తగ్గలేదు.. దిల్జీత్ దోసాంజ్ సంచలన వ్యాఖ్యలు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ నవంబర్ 15న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన, ఇండోర్‌లో తన ప్రదర్శనను ఆపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, అయినప్పటికీ అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఎక్కడా భయపడకుండా నగరానికి వచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మహాకాళుడి భూమి అని, ఇక్కడికి రాకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరని వేదికపై వేలాది మంది అభిమానుల సమక్షంలో స్పష్టం చేశారు. ఒకసారి వస్తానని మాట ఇస్తే ఎప్పటికీ వెనక్కి తగ్గనని, ఎన్ని ఆంక్షలు పెట్టినా మీ ముందుకు వచ్చానని ఉద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ ఉర్దూ కవి దివంగత రాహత్ ఇండోరీ రాసిన గజల్ పంక్తులను కూడా దిల్జీత్ ఆలపించి ఆకట్టుకున్నారు.

వాస్తవానికి ఇండోర్ కాన్సర్ట్‌కు ముందు దిల్జీత్ పాడే కొన్ని పాటలపై అధికారులు ఆంక్షలు విధిస్తూ నోటీసులు జారీ చేశారు. మద్యం, మాదకద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే విధంగా సాహిత్యం ఉన్న నాలుగు పాటలను వేదికపై ఆలపించకూడదని జిల్లా బాలల సంరక్షణ అధికారి నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఐదేళ్లు పైబడిన చిన్నారులకు కూడా ఈ వేడుకకు అనుమతి ఉన్నందున, పాటల సాహిత్యం పిల్లలపై తప్పుడు ప్రభావం చూపే అవకాశం ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు.

పటియాలా పెగ్, 5 తారా, జీబ్ విచో అఫీమ్, జట్ ఉథే ఫైర్ కర్దా అనే నాలుగు పాటలపై నిషేధం విధిస్తూ నవంబర్ 6న నోటీసులు ఇచ్చారు. 2019లో పంజాబ్, హర్యానా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉటంకిస్తూ, చండీగఢ్‌కు చెందిన ప్రొఫెసర్ పండిట్‌రావు ధరేనవర్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. పదాలు మార్చి కూడా ఆ పాటలను పాడకూడదని ఆయన అధికారులను కోరారు.

అయితే కేవలం ఆ నాలుగు పాటలకు మాత్రమే పరిమితులు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల అక్టోబర్ చివర్లో ఢిల్లీలో జరిగిన దిల్జీత్ కాన్సర్ట్‌కు కూడా భద్రతా కారణాల రీత్యా తొలుత అనుమతి నిరాకరించినప్పటికీ, ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రదర్శన విజయవంతంగా జరిగింది. తాజాగా ఇండోర్ వేదికపై దిల్జీత్ చేసిన వ్యాఖ్యలు సంగీత వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.