BREAKING
ఉక్రెయిన్‌లో పెరిగిన అణు ప్రమాద ముప్పు సామూహిక సెలవు కోరిన పంచాయతీ కార్యదర్శులు హంగేరీలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు ప్రచారంలో జోరు పెంచిన సర్పంచ్ అభ్యర్థి బుల్లి రెడ్డి. గాంబియా అధ్యక్ష ఎన్నికల బరిలో అడామా బారో ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం - గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ దంపతులు మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గుమ్మాల్లపాడు లో కూటమి పొత్తు బీటలు వారేనా? యూనివర్సిటీ అంతర్ కళాశాల చెస్ టోర్నమెంట్ విజేత యస్ వి కళాశాల శివోహం కూచిపూడి మహాబృంద నాట్య ప్రదర్శనలో ఖండవల్లి విద్యార్థినిలు అర్హులైన పేదలందరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి వివేక్ వెంకటస్వామి బాదంపల్లిలో వివో భవన నిర్మాణానికి భూమి పూజ వాలీబాల్‌లో లక్షెట్టిపేట విద్యార్థిని ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనిత్య ఎంపిక ! గ్రంథాలయం అనే పునాదిపై విద్యార్థుల భవిష్యత్తును నిర్మించుకోవాలి *డాక్టర్ సలాది శ్రీ రాజేశ్వరి నన్ను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వెనక్కి తగ్గలేదు.. దిల్జీత్ దోసాంజ్ సంచలన వ్యాఖ్యలు!

విడాకులకు ముందు కమల్, సారిక మధ్య ఎంతో లోతైన ప్రేమ ఉండేది.. శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Select Suryaa Now
విడాకులకు ముందు కమల్, సారిక మధ్య ఎంతో లోతైన ప్రేమ ఉండేది.. శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: లోకనాయకుడు కమల్ హాసన్, నటి సారిక 1988లో వివాహం చేసుకుని, 2002లో విడిపోయి, 2004లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి, గాయని శ్రుతి హాసన్ తన తల్లిదండ్రుల బంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రులు ప్రస్తుతం కలిసి లేరన్న విషయం అందరికీ తెలిసిందేనని, అయితే వారు కలిసి ఉన్న రోజుల్లో వారి మధ్య ఎంతో లోతైన ప్రేమ, అనుబంధం ఉండేవని తెలిపారు. ఒకరితో ఒకరు ఎంతో సరదాగా ఉంటూ, వృత్తిపరంగా కలిసి పనిచేసేవారని, ఇద్దరూ ఒకరికొకరు గొప్ప సృజనాత్మక భాగస్వాములుగా మెలిగారని గుర్తు చేసుకున్నారు.

చిన్నప్పటి నుంచీ తన తల్లిదండ్రుల అనుబంధాన్ని చూసి పెరిగిన తాను, పెద్దయ్యాక తన జీవిత భాగస్వామితో కలిసి కొత్త విషయాలు నిర్మించాలని, కలిసి పనిచేయాలని భావించేదాన్నని శ్రుతి హాసన్ వివరించారు. ప్రముఖ నటీనటుల పిల్లలమైనప్పటికీ తాము గారాబంతో పాడవకూడదని తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త తీసుకున్నారని చెప్పారు. స్కూల్ రోజుల్లో తాను అడిగినవన్నీ తండ్రి కమల్ హాసన్ కొనిచ్చేవారు కాదని, ఆ క్రమశిక్షణ విలువ తనకు వయసు పెరిగేకొద్దీ అర్థమైందని పేర్కొన్నారు. టిక్ టిక్ టిక్, రాజ్ తిలక్, హే రామ్ వంటి చిత్రాల్లో కమల్ హాసన్, సారిక కలిసి పనిచేశారు.

ఇక తన వ్యక్తిగత జీవితం, వివాహంపై అభిప్రాయాల గురించి శ్రుతి హాసన్ ఎప్పుడూ నిక్కచ్చిగా మాట్లాడుతుంటారు. ఆర్టిస్ట్ శాంతను హజారికాతో నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన ఆమె, వ్యక్తిగత విభేదాల కారణంగా 2024లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉంటూ కెరీర్, వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి సారించినట్లు తెలిపారు. తోడు అనే భావన తనకు ఇష్టమే అయినప్పటికీ, పెళ్లి పేరుతో జరిగే కాగితపు పనులు, భారీ ఖర్చులు, ఆడంబరాలపై తనకు నమ్మకం లేదని, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నామో అర్థం కాదని గతంలో ఓ సందర్భంలో అభిప్రాయపడ్డారు.

సినిమాల విషయానికి వస్తే శ్రుతి హాసన్ చివరిసారిగా 2025లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కూలీ చిత్రంలో నటించారు. నాగార్జున అక్కినేని, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్, రచిత రామ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.518 కోట్లు వసూలు చేసింది. ఇటీవల సాయి అభ్యంకర్‌తో కలిసి పవళ మల్లి పాట పాడిన శ్రుతి, రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.